Skip to main content

TTD Contract Jobs : తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంటాక్ట్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు... నెల‌కు రూ.2 లక్షల జీతంతో పాటు...

సాక్షి ఎడ్యుకేష‌న్ : తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో రెండేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల‌కు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చారు.
TTD Contract Jobs

మిడిల్ లెవెల్ కన్సల్టెంట్‌ భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాల‌ను ఎంపిక చేస్తారు. 

అర్హ‌త‌లు ఇవే..
హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఆఫ్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ లేదా ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ లేదా రెలీజియస్‌ ఆర్గనైజేషన్‌ తదితరాల విభాగంలో 10 నుంచి 15 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఐటీ/ అనలిటికల్‌/ కమ్యూనికేషన్‌ తదితరాల్లో నైపుణ్యం అవసరం. ఈ ఉద్యోగాల‌కు 45 ఏళ్లు మించకూడదు. 

దరఖాస్తు విధానం :
ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్, పాత అలిపిరి గెస్ట్ హౌస్, తిరుపతి చిరునామాకు పంపించాలి. 
దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్ చిరునామా: recruitments.slsmpc@gmail.com

జీతం : 
నెలకు రూ.2 లక్షలతో పాటు అవసరమైన వసతి, ల్యాప్‌టాప్ సౌకర్యం కల్పిస్తారు.

Published date : 01 Oct 2024 10:19AM

Photo Stories