Skip to main content

TTD Contract jobs Interviews: TTDలో కాంట్రాక్టు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

TTD Contract jobs Interviews
TTD Contract jobs Interviews

తిరుపతి (అలిపిరి): టీటీడీ ఆసుపత్రులు, డిస్పెన్సరీలలో ఏడాది కాంట్రాక్టు ప్రాతిపదికన 5 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు ఈనెల 29న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో బీసీ–బీ ఉమెన్‌, బీసీ–డీ ఉమెన్‌, ఎస్టీ ఉమెన్‌, బీసీ–బీ, ఎస్సీలో ఒక్కొక్క పోస్టు చొప్పున భర్తీ చేయనున్నట్లు తెలియజేశారు.

ఏపీ తెలంగాణలో స్కూళ్లకు మరో 2 రోజులు సెలవులు: Click Here

టీటీడీ పరిపాలనా భవనంలోని సెంట్రల్‌ హాస్పిటల్‌లో 29న ఉదయం 11గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూకు ఎంబీబీఎస్‌ అర్హతగల అభ్యర్థులు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 0877–2264371 నంబర్‌గానీ లేదా www. tirumala.org వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు.

Published date : 21 Aug 2024 07:58PM

Photo Stories