Skip to main content

TS Gurukulam Jobs : 12000 పైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం.. కానీ నోటిఫికేష‌న్ మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. మొత్తం 12 వేలకు పైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. ఒక్క నోటిఫికేషన్‌ కూడా వెలువడక పోవడంతో, ఆయా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో నిరాశా నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి.
ts gurukulam recruitment
ts gurukulam recruitment 2023

తొలుత వివిధ కేటగిరిల్లో 9,096 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు జారీ చేసింది. అయితే అందుకు సంబంధించిన ప్రకటనలు జారీ చేయడంలో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) తాత్సారం చేస్తోంది.

☛ TS Government Jobs : విద్యాశాఖలో 20 వేల పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఇందులో భాగంగానే గురుకుల విద్యా సంస్థల్లో..

ts gurukulam job 2023

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వశాఖల్లో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గతేడాది అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. ఇందులో భాగంగా గురుకుల విద్యా సంస్థల్లో 12 వేల ఖాళీలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇందులో 9,096 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు జారీ చేసింది. ఆర్థిక శాఖ సైతం అన్ని రకాల ఉత్తర్వులను జారీ చేసింది. ఇదంతా జరిగి దాదాపు ఏడు నెలలు గడిచింది. కానీ టీఆర్‌ఈఐఆర్‌బీ మాత్రం ఇప్పటికీ ఒక్క ప్రకటన కూడా జారీ చేయలేదు.

☛ చ‌ద‌వండి: TSPSC Jobs Notification 2022: 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు

3 వేల పోస్టుల భర్తీకి మ‌రో సారి..

ts jobs

బోర్డు పరిధిలో అదనంగా వచ్చిన కొన్ని కొలువులకు అనుమతులు రాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. గురుకుల విద్యా సంస్థల్లో 3 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం కాస్త ఆలస్యంగా ఆమోదం తెలిపింది. అయితే అందుకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు ఇంకా వెలువడలేదు. ఈ అంశం ప్రస్తుతం ఆ శాఖ వద్దే పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ 3 వేల కొలువులకు కూడా అనుమతులు వచ్చిన తర్వాత ఒకేసారి ప్రకటనలు జారీ చేస్తామని టీఆర్‌ఈఐఆర్‌బీ అధికారులు చెబుతున్నారు. దాదాపు రెండున్నర నెలలుగా గురుకుల నియామకాల బోర్డు అధికారులు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. అయినా ఇప్పటివరకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేయకపోవడంపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

☛ TSPSC : డీటీ కంటే ఏఎస్‌ఓ పోస్టులే అధికం.. గ్రూప్‌ 2పై ఇలా గురిపెట్టండి

ప్ర‌ముఖ‌ శిక్షణ కేంద్రంలో మూడు నెలల కొచ్చింగ్ తీసుకున్నా.. కానీ..
గురుకులాల్లో టీజీటీ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత శిక్షణ కేంద్రంలో మూడు నెలల పాటు శిక్షణ తీసుకున్నాను. దాదాపు నాలుగు నెలలుగా నోటిఫికేషన్లు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటికీ ఒక్క ప్రకటన కూడా వెలువడకపోవడం తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోంది. 
           – చిట్టెల మల్లేశ్, ముజాహిద్‌పూర్, వికారాబాద్‌ జిల్లా  

ఇంకెప్పుడు..
గురుకుల విద్యా సంస్థల్లో బోధన ఉద్యోగాలు, ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌ కొలువులకు గత రెండు సంవత్సరాలుగా సిద్ధమవుతున్నా. గురుకుల ఖాళీల విషయం తెలిసిన వెంటనే ప్రైవేటు శిక్షణ కేంద్రంలో కోచింగ్‌ సైతం తీసుకున్నాను. ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌ ఉద్యోగాలు మొదలు ఇతర కేటగిరీల్లో పలు ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడుతున్నా, బోధన రంగంలో ఉద్యోగాలకు ఎలాంటి ప్రకటనలు వెలువడటం లేదు. 
   – మల్రెడ్డిపల్లి సుజాత, కుల్కచర్ల, వికారాబాద్‌ జిల్లా

☛ SSC Jobs Notification : 11409 ఉద్యోగాల భ‌ర్తీకి ఎస్ఎస్‌సీ నోటిఫికేష‌న్‌.. ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తోనే.. పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 23 Jan 2023 04:46PM

Photo Stories