TSPSC : డీటీ కంటే ఏఎస్‌ఓ పోస్టులే అధికం.. గ్రూప్ 2పై ఇలా గురిపెట్టండి
గ్రూప్–2.. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఎంతో క్రేజ్ ఉన్న సర్వీసులు. గ్రూప్–1తో పోల్చితే ఈ పోస్ట్‌లకు పోటీ పడే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి గ్రూప్–2 అభ్యర్థులు ఇక ప్రిపరేషన్‌పై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో.. గ్రూప్–2 నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక విధానం, పరీక్ష ప్యాట్రన్, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ గైడెన్స్...
ఏఎస్‌ఓ పోస్టులే ఎక్కువ...!
టీఎస్‌పీఎస్‌సీ తాజాగా విడుదల చేసిన గ్రూప్ 2 నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 783 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. వీటిల్లో ఏఎస్‌ఓ పోస్ట్‌ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ హోదాలో 214 పోస్ట్‌లున్నాయి. గ్రూప్–2 అనగానే అభ్యర్థులు తొలి ప్రాధాన్యంగా భావించే డిప్యూటీ తహశీల్దార్ పోస్ట్‌ల సంఖ్య 98గానే ఉండడంతో నిరుద్యోగులు కొంత నిరాశకు గురవుతున్నారు. గ్రూప్–2 పోస్ట్‌లకు సంబంధించి రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే తుది నియామకాలు ఖరారు చేస్తారు. ఈ రాత పరీక్షను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తామని ప్రకటించారు.
గ్రూప్–2 సర్వీసులకు నిర్వహించే రాత పరీక్ష నాలుగు పేపర్లుగా 600 మార్కులకు ఉంటుంది. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున కేటాయించారు. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అంశాలు ఉంటాయి. పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ; పేపర్ 3లో ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్; పేపర్ 4లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం అంశాలు ఉంటాయి.