Skip to main content

Good News For All 1Lakh Rupees Government announced: రాష్ట్రంలో వాళ్లందరికీ భారీ గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.1,00,000.. ప్రభుత్వం ప్రకటన!

Good News  Telangana Congress government announcement on financial aidAnnouncement of Rs.1,00,000 support for civil mains candidates in Telangana
Good News

అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా సరే కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు వరుస శుభవార్తలు చెప్తూనే వస్తోంది. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో భారీ గుడ్ న్యూస్ వెల్లడించారు.

వారం రోజుల పాటు పాఠశాలలు బంద్‌.. ఎందుకంటే: Click Here

సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి తీపి కబురు

సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి తీపి కబురు చెప్పింది. అధికారం చేపట్టింది మొదలు అటు ప్రజా సంక్షేమం, ఇటు ఉద్యోగ, ఉపాధి కల్పనకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ప్రతి ఒక్క అభ్యర్థికి రూ.1,00,000 రూపాయల నగదు

ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో సివిల్స్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి శుభవార్త చెప్పారు. సివిల్స్ మెయిన్స్ పరీక్షకు ఎంపికైన ప్రతి ఒక్క అభ్యర్థికి రూ.1,00,000 రూపాయల నగదును ఆర్థిక సాయం అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అయితే గతంలో ఇటీవలే సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది.

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మెటీరియల్, ప్రత్యేక శిక్షణ

మరోసారి ఎవరైతే ఎంపికవుతారో వారికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మెటీరియల్, ప్రత్యేక శిక్షణ వంటి అవసరాలను ఈ ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తోందని, తెలంగాణ నుంచి ఎక్కువ మంది సివిల్స్ ఉద్యోగాలు సాధిస్తే.. వారి వల్ల రాష్ట్రానికే మంచి చేకూరుతుందన్నారు. పాలన సులువు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
 

Published date : 09 Nov 2024 05:39PM

Photo Stories