TS Government Jobs : విద్యాశాఖలో 20 వేల పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో చిరుమర్తి చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడురోజులుగా నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలల నియోజకవర్గస్థాయి కబడ్డీ పోటీలు జనవరి 11వ తేదీన (బుధవారం) ముగిశాయి.ఈ సందర్భంగా జరిగిన బహుమతుల ప్రదానోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
20 వేల పోస్టులకు..
తెలంగాణలో ఇప్పటికే వివిధ ప్రభుత్వశాఖల్లో 80 వేల పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేశారని, విద్యాశాఖలోనే అత్యధికంగా 20 వేల పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని హైస్కూళ్లలో పీఈటీ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోబోతున్నామని మంత్రి వెల్లడించారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. గురుకులాల్లో ఒక్కో విద్యారి్థపై రూ.లక్షాఇరవై వేలు ఖర్చు చేస్తూ నాణ్యమైన ఇంగ్లిష్ విద్యను అందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ గురుకులాల్లోని విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని మంత్రి చెప్పారు.
ప్రపంచంలో ఎక్కడైనా పోటీ పడాలంటే..
రాష్ట్రంలో 1,150 గురుకుల జూనియర్, 85 డిగ్రీ, రెండు పీజీ కళాశాలలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడైనా పోటీ పడాలంటే ఇంగ్లిష్ అవసరమని సీఎం భావించి ‘మన ఊరు–మన బడి’కార్యక్రమంలో తెలంగాణవ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ పాఠశాలలను మూడు విడతలుగా అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో క్రీడాప్రాంగణం నిర్మించామన్నారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్లగొండ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: TSPSC Jobs Notification 2022: 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు