Skip to main content

Telangana : పీడీ, లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీ ఇంకెప్పుడు..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : జూనియర్‌ కళాశాల లెక్చరర్‌ పోస్టుల భర్తీ (జేఎల్‌) నోటిఫికేషన్‌లో ప్రభుత్వ జూనియర్‌ ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీ లేకపోవడంపై తెలంగాణ జూనియర్‌ కాలేజ్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

జులైలో ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో 117లో 1523 ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్‌ పోస్టులు భర్తీకి అనుమతినిచ్చిందని తెలంగాణ జూనియర్‌ కళాశాలల అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఆలేరు బాలరాజు, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బొమ్మర బోయిన లక్ష్మయ్య గుర్తు చేశారు.

91ప్రభుత్వ జూనియర్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు, 40 లైబ్రేరియన్‌ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ కమిషన్‌ నోటిఫికేషన్లు జారీ చేయకపోవడం విడ్డూరమన్నారు. దీనిపై సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సత్వరమే జోక్యం చేసుకొని కొత్తగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌ ఫిజికల్‌ డైరెక్టర్లు, పాలిటెక్ని క్‌ కాలేజ్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల కోసం ప్రత్యే క నోటిఫికేషన్‌ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Published date : 12 Dec 2022 06:33PM

Photo Stories