1,140 Jobs: వైద్య పోస్టులకు రెండ్రోజుల్లో నోటిఫికేషన్
అలాగే పీహెచ్‌సీల్లో వెయ్యి మంది డాక్టర్ల భర్తీకి 10 రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామన్నారు. త్వరలోనే మరో 140 మంది మిడ్ వైఫరీలు అందుబాటులోకి వస్తారని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలోని పీడియాట్రిక్, పీడియాట్రిక్ సర్జరీ, గైనకాలజీ ఐసీయూలు, సెమినార్ హాలు, గాంధీ ఆస్పత్రి వెబ్ పోర్టల్‌ను డీఎంఈ రమేశ్‌రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావుతో కలసి మంత్రి సెప్టెంబర్ 23న ప్రారంభించారు. పలు వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన పథకాలు, అభివృద్ధి పనులతో హైదరాబాద్ మెడికల్ హబ్‌గా మారిందన్నారు.
చదవండి:
Specialist Jobs: టీవీవీపీ ఆసుపత్రులు, హైదరాబాద్‌లో 66 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Senior Resident Jobs: సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, న్యూఢిల్లీలో 434 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..