Medical Seats: సర్దుబాటులో ఫీజుల రగడ
ఈ రెండు కాలేజీల్లో బీ, సీ కేటగిరీల MBBS విద్యార్థులు, అందులోని ఒక కాలేజీకి చెందిన పీజీ మెడికల్ విద్యార్థులు చెల్లించిన ఫీజు పూర్తిస్థాయిలో వెనక్కి రావడంలేదు. కొందరు విద్యార్థులు డొనేషన్లు చెల్లించగా మరికొందరు తక్కువ ధరకు ఫీజు మాట్లాడుకొని కోర్సు పూర్తయ్యే సంవత్సరం వరకు చెల్లించారు. డొనేషన్లు చెల్లించిన విద్యార్థులకు రసీదు లేకపోవడం ఒక సమస్య కాగా కొందరు తక్కువ ధరకు మాట్లాడుకోవడం వల్ల ఇతర కాలేజీల్లో సర్దుబాటుతో పూర్తిస్థాయి ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. సర్దుబాటు ప్రక్రియ గడువు సెప్టెంబర్ 15తో ముగియనున్న నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి విన్నవిస్తున్నారు. అయితే ఈ సమస్యలను పరిష్కరించలేమని, ఆయా కాలేజీలే చూసుకోవాలని కాళోజీ వర్గాలు అంటున్నాయి. సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్, పటాన్‌చెరులోని టీఆర్‌ఆర్, వికారాబాద్‌లోని మహావీర్ మెడికల్ కాలేజీల్లో మౌలికవసతులు, ల్యాబ్‌లు సరిగ్గా లేవంటూ 450 MBBS సీట్లతోపాటు రెండు కాలేజీల్లోని 113 పీజీ మెడికల్ అడ్మిషన్లను National Medical Council (NMC) రద్దు చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఆయా కాలేజీల విద్యార్థులను 13 ప్రైవేటు కాలేజీల్లో సర్దుబాటు చేస్తున్నారు.
చదవండి:
NEET 2022: ఇంత ర్యాంకు వచ్చినా రాష్ట్రంలో సీటు.. నీట్‌పై నిపుణుల విశ్లేషణ..