MBBS: ఫస్ట్ ఇయర్ ఈలోపు పూర్తి చేయాలి
2019–20 వైద్య విద్యార్థుల బ్యాచ్ నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చిందని ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ నాలుగేళ్లలోపు తొలి ఏడాది వైద్యవిద్యను పూర్తి చేసినా.. మొత్తం నాలుగున్నరేళ్ల వైద్యవిద్యను ఎట్టి పరిస్థితుల్లోనూ 10 ఏళ్లలోపు పూర్తి చేయాల్సిందేనని తెలిపింది. ఇలా తొలి ఏడాది వైద్య విద్యార్థులు నాలుగేళ్లలో పూర్తి చేయాలనే నిబంధనను తాజాగా అమల్లోకి తీసుకొచ్చారు. అంతకుముందు ఈ నిబంధన లేదు.
చదవండి: ‘నీట్’లాగే నర్సింగ్‌కూ జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష: ఎలా ఉంటుందంటే...
ఎంబీబీఎస్ చదివిన చోటే ఇంటర్న్‌షిప్
ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎక్కడైతే ఎంబీబీఎస్ వైద్య విద్య అభ్యసిస్తారో..అక్కడే ఇంటర్న్‌షిప్ కూడా చేయాలని National Medical Commission (NMC) స్పష్టం చేసింది.
నవంబర్ 2021 తర్వాత ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇది వర్తి స్తుందని పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రెం డేళ్లలోపు ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాలని, అని వార్య పరిస్థితుల్లో పొడిగించుకోవచ్చని సూచి ంచింది. విదేశీ వైద్య విద్యార్థులకు మాత్రం వెసులుబాటు కల్పించింది. అయితే వారికి తొలి ప్రాధాన్యంగా కొత్త వైద్యకళాశాలల్లో కేటా యింపులు జరపాలని పేర్కొంది. ఈ మేరకు ఎన్‌ఎంసీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
చదవండి: ఈ కాలేజీల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి
ఎంబీబీఎస్ తర్వాత నెక్ట్స్ పాసైతేనే రిజిస్ట్రేషన్
ఇకపై ఎంబీబీఎస్ పూర్త యిన తర్వాత మెడికల్ కౌన్సిల్‌లో రిజి్రస్టేషన్ చేయాలన్నా, సొంత ప్రాక్టీస్ చేయాలన్నా National Exit Test (NExT) పరీక్ష పాస్ కావాలి.
లేకుంటే రిజిస్ట్రేషన్, ప్రాక్టీస్ చేయడం కుద రదు. వచ్చే ఏడాది జనవరిలో ఢిల్లీలోని ఎయిమ్స్ సహకారంతో నెక్ట్స్ నిర్వహించేందుకు National Medical Commission (NMC) రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఆరోగ్య విశ్వవిద్యాలయాలకు సంకేతాలు ఇచ్చింది. అలాగే ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థులు నెక్ట్స్ ఉత్తీర్ణులైతే, పీజీ మెడికల్ ‘నీట్’రాయాల్సిన అవసరం లేదని కేంద్రం జాతీయ వైద్య కమిషన్ బిల్లులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు 15 మంది నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు కానుంది. ప్రస్తుతం ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లో భాగంగా తొలి మూడు నెలలు జిల్లా, ఇతర ఆస్పత్రుల్లో తప్పనిసరిగా పనిచేసేలా విశ్వవిద్యాలయాలకు ఎన్‌ఎంసీ మార్గదర్శకాలను పంపించింది. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ విభాగాల్లో విద్యార్థులు పని చేయాలి. మిగిలిన 9 నెలల్లో ఎలా ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాలో కూడా వివరించింది. ఈసారి కొత్తగా ఫోరెన్సిక్ మెడిసిన్, ఆయుర్వేదం, హోమియో, టీబీ కేం ద్రం, ల్యాబ్‌ల్లో పనితీరుపైనా విద్యార్థులు అవగాహన పెంచుకునేందుకు వీలుగా షెడ్యూలు ఖరారు చేసింది.