NEET PG Admissions: తుది దశకు నీట్–పీజీ అడ్మిషన్లు.. కటాఫ్ ఇలా..
కటాఫ్ తగ్గించడంతో మిగిలిపోయిన సీట్ల భర్తీకి మార్గం సుగమమైంది. పీజీ ప్రవేశాలకు అర్హత సాధించాలంటే ఇప్పటివరకు జనరల్ విద్యార్థులు 50 శాతం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు 40 శాతం పర్సంటైల్ సాధించాలనే నిబంధన ఉంది. దీనివల్ల చాలా వర్సిటీలలో పీజీ సీట్లు మిగిలిపోతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కటాఫ్ పర్సంటైల్‌ను జనరల్‌కు 15 శాతం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 10 శాతంగా నిర్ణయించింది.
తగ్గిన కటాఫ్ ప్రాతిపదికన మిగిలిపోయిన సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 8న సాయంత్రం ఐదు గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరింది.
ధ్రువపత్రాల పరిశీలన అనంతరం మెరిట్ జాబితాను విడుదల చేస్తుంది. తదనుగుణంగా వెబ్ ఆప్షన్లకు మరో నోటిఫికేషన్ జారీ చేస్తుంది.
చదవండి: Sakshi EAPCET & NEET Grand Mock Test 2024 Question Paper With Key: Engineering | Agriculture | NEET
ఇన్‌సర్వీస్ వైద్యులకు నిరాశే
స్థానికతపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం జరగాల్సిన వాదనలు 15 తేదీకి వాయిదా పడ్డాయి. దీంతో తెలంగాణ ఇన్ సర్వీస్ డాక్టర్లకు నిరాశే ఎదురైంది. రాష్ట్రంలో ఇన్‌సర్వీస్ కోటా కింద 297 సీట్లు ఉండగా , ఇప్పటివరకు 17 మంది మాత్రమే పీజీలో చేరారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
కటాఫ్ తగ్గిస్తూ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా ఇచ్చిన నోటిఫికేషన్ దరఖాస్తులకు ఈ నెల 11 చివరి తేదీగా నిర్ణయించటంతో.. కేసు విచారణకు ముందే ఇన్ సర్వీస్ కోటా సీట్ల భర్తీ కూడా పూర్తవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.
Tags
- Telangana NEET PG Admission
- NEET PG Counselling
- PG Medical Counselling
- NEET PG 2025 Counselling Schedule
- NEET PG Counselling Process in India
- Process of NEET PG Counselling 2025
- NEET PG Final Phase Counselling
- NEET PG 2025 counselling date latest News
- NEET PG 2025 latest News
- Telangana News
- knruhs
- kaloji narayana rao university of health sciences
- MedicalAdmissionUpdates
- PGMedicalCutoffReduction
- PGMedicalSeats
- KalojiHealthUniversity
- TelanganaPGSeats