విరితో పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు
Sakshi Education
పాఠశాల విద్యార్థులకు వైద్యపరీక్షలు అందించేందుకు వైద్య విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని National Medical Commission (NMC) నిర్ణయించింది.
దేశం మొత్తమ్మీద 11.20 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో 11.80 కోట్ల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వీరికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు అందించేందుకు వైద్య విద్యార్థులను పంపించాల్సిందిగా కేంద్ర పాఠశాల విద్యాశాఖ ఇటీవలే కేంద్ర ఆరోగ్య శాఖను కోరింది. ఇందులో భాగంగా NMC తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. పీజీ, ఇంటర్న్‌షిప్, నర్సింగ్ విద్యార్థులకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
చదవండి:
Published date : 20 Jul 2022 03:55PM