ఎంబీబీఎస్ తర్వాత నెక్ట్స్ పాసైతేనే రిజిస్ట్రేషన్
లేకుంటే రిజిస్ట్రేషన్, ప్రాక్టీస్ చేయడం కుద రదు. వచ్చే ఏడాది జనవరిలో ఢిల్లీలోని ఎయిమ్స్ సహకారంతో నెక్ట్స్ నిర్వహించేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) రం గం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఆరోగ్య విశ్వవిద్యాలయాలకు సంకేతాలు ఇచి్చ ంది. అలాగే ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థులు నెక్ట్స్ ఉత్తీర్ణులైతే, పీజీ మెడికల్ ‘నీట్’రాయాల్సిన అవసరం లేదని కేంద్రం జాతీయ వైద్య కమిషన్ బిల్లులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు 15 మంది నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు కానుంది. ప్రస్తుతం ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లో భాగంగా తొలి మూడు నెలలు జిల్లా, ఇతర ఆస్పత్రుల్లో తప్పనిసరిగా పనిచేసేలా విశ్వవిద్యాలయాలకు ఎన్‌ఎంసీ మార్గదర్శకాలను పంపించింది. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ విభాగాల్లో విద్యార్థులు పని చేయాలి. మిగిలిన 9 నెలల్లో ఎలా ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాలో కూడా వివరించింది. ఈసారి కొత్తగా ఫోరెన్సిక్ మెడిసిన్, ఆయుర్వేదం, హోమియో, టీబీ కేం ద్రం, ల్యాబ్‌ల్లో పనితీరుపైనా విద్యార్థులు అవగాహన పెంచుకునేందుకు వీలుగా షెడ్యూలు ఖరారు చేసింది.