Skip to main content

Andhra Pradesh: ఉచిత కోర్సులు... యువ‌త నిరుద్యోగుల‌కు మాత్ర‌మే

ఈ కోర్సుల ద్వారా ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని, వీటిని వినియోగించుకోమ‌ని సూచిస్తూ కోర్సు వివ‌రాలు, వాటికి కావ‌ల‌సిన ల‌క్ష‌ణాల గురించి స్ప‌ష్టంగా చెప్పారు స్కిల్ హ‌బ్ ఇంచార్జి ఎ.చ‌క్ర‌వ‌ర్తి.
job courses announced by skill hub incharge A.Chakravarti
job courses announced by skill hub incharge A.Chakravarti

సాక్షి ఎడ్యుకేష‌న్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ స్కిల్‌ హబ్‌ల ద్వారా నిరుద్యోగ యువతకు పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని స్కిల్‌ హబ్‌ ఇన్‌చార్జి ఎ.చక్రవర్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రేబాకలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో వచ్చే నెల 4న కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌, డొమెస్టిక్‌ నాన్‌ వాయిస్‌ కోర్సులపై కొత్త బ్యాచ్‌కు ఉచిత శిక్షణ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ఇంజినీరింగ్‌ ఎగుమతుల్లో క్షీణత

ఈ శిక్షణ తరగతులకు టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, డిప్లోమాలో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు పాల్గొనవచ్చన్నారు. కేవలం 30 సీట్లు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 28న నేరుగా కళాశాలకు వచ్చి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ నెం.7013342667, 8143229228కు సంప్రదించాలన్నారు. 

బాలుడిపై తోటి విద్యార్థులతో దాడి చేయించిన టీచర్..

Published date : 26 Aug 2023 02:30PM

Photo Stories