TU Outsourced Staff: ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి
Sakshi Education
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని తెయూ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.
జూలై 31న యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎం యాదగిరిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం రిజిస్ట్రార్ చేతుల మీదుగా డిమాండ్లతో కూడిన వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎల్‌బీ రవికుమార్, అధ్యక్ష, కార్యదర్శులు సురేష్, బికోజీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు వ్యవస్థ అనే పదాలు లేకుండా చేస్తానని గత ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం తమను రెగ్యులరైజ్ చేయాలన్నారు. నరేష్, రవీందర్, రమేష్, శ్రీధర్, గణేశ్, దిగంబర్, క్రాంతి, పుణ్యవర్ధన్, మమత, శోభారాణి, పద్మ, రాము పాల్గొన్నారు.
చదవండి:
VC Ravinder Gupta: ఏసీబీ వలకు చిక్కిన తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా
Published date : 01 Aug 2023 03:26PM