Telangana University: రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ యాదగిరి
వెంటనే యాదగిరి ఈ విషయాన్ని రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి నవీన్ మిత్తల్, ఈసీ మెంబర్ల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచన మేరకు యాదగిరి వెంటనే రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం వర్సిటీలో రిజిస్ట్రార్ నియామకం విషయంలో వివాదం నెలకొనడంతో జీతాలు రాక అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఐదు రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. భోజనాలు వండే వారు లేక విద్యార్థులు పస్తులుంటూ భిక్షాటన చేసి కడుపునింపుకుంటున్నారు. ఇది మీడియాలో రావడంతో ప్రభుత్వ పెద్దలు వీసీ తీరుపై కన్నెర్ర చేశారు.
చదవండి: Telangana University: వీసీ అక్రమాలపై విచారణ.. ‘సాక్షి’పత్రికకు ధన్యవాదములు’అంటూ ఫ్లెక్సీ..
ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన వీసీ చివరికి మనసు మార్చుకుని ఈసీ ఎంపిక చేసిన ప్రొఫెసర్ యాదగిరినే రిజిస్ట్రార్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కొన్ని నెలలుగా ఈసీ నిర్ణయాలను సవాల్ చేస్తూ వీసీ ఏకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవడంతో సర్కారు కన్నెర్ర చేసింది. వీసీ అవినీతి, అక్రమాలపై ఈసీ ఫిర్యాదుతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా దాడులు చేయించింది. వీసీ తన మెడకు అవినీతి ఉచ్చు బిగుసుకుంటుండటంతో అందోళనకు గురయ్యారు. అన్ని దారులు మూసుకుపోవడంతో దిగివచ్చా రు. ఇప్పటికైనా వర్సిటీ పాలన గాడిలో పడుతుందని విద్యార్థులు, ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: Telangana University Notification: పార్ట్-టైమ్ లెక్చరర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..