Vice Chancellors: 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం.. వీసీలుగా నియామకమైన ఐఏఎస్‌లు వీరే..
ఈ మేరకు మే 21న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం పది విశ్వవిద్యాలయాల వీసీల పదవీ కాలం మే 21వ తేదీతో ముగిసింది. దీనితో వెంటనే వర్సిటీలు ఇన్‌చార్జుల అధీనంలోకి వెళ్లాయి.
కొత్త వీసీలు వచ్చే వరకూ అధికారుల పాలనే కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీసీల నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి.
చదవండి: TS EAMCET 2024: ఎంసెట్‌లో ఆ ర్యాంకు వస్తే.. టాప్ కాలేజీల్లో సీటు పక్కా
సెర్చ్ కమిటీలు వేసినా..
వాస్తవానికి వీసీల పదవీ కాలం ముగియక ముందే కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిందని అధికారులు అంటున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని వీసీల నియామకం కోసం దాదాపు అన్ని యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీలను నియమించారు. వీసీ పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆ కమిటీ పరిశీలించి.. అన్ని అర్హతలున్న వారి జాబితాను ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది.
ఆ తర్వాత నియామకాలు ఉంటాయి. కానీ సెర్చ్ కమిటీలు ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అయితే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు కాకపోవడంతో సెర్చ్ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో ప్రస్తుత వీసీలనే కొంతకాలం కొనసాగించాలని తొలుత భావించారు.
కానీ ఈ ప్రతిపాదనపై అధికారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పలువురు వీసీలపై ఆరోపణలు, మరికొందరి తీరు వివాదాస్పదం కావడం నేపథ్యంలో.. వారిని కొనసాగించేందుకు ప్రభుత్వం సుముఖత చూపలేదు.
ఏ యూనివర్సిటీ వీసీ కోసం ఎన్ని దరఖాస్తులు?
యూనివర్సిటీ |
వచ్చిన దరఖాస్తులు |
అంబేడ్కర్ ఓపెన్ |
208 |
ఉస్మానియా |
193 |
పాలమూరు |
159 |
శాతవాహన |
158 |
మహాత్మాగాంధీ |
157 |
కాకతీయ |
149 |
తెలంగాణ |
135 |
జేఎన్టీయూహెచ్ |
106 |
తెలుగు వర్సిటీ |
68 |
జేఎన్‌ఎఫ్‌ఏయూ |
51 |
మొత్తం |
1,382 |
వర్సిటీల ఇన్‌చార్జి వీసీలుగా నియామకమైన ఐఏఎస్‌లు
ఉస్మానియా వర్సిటీ |
దాన కిషోర్ |
జేఎన్టీయూహెచ్ |
బుర్రా వెంకటేశం |
కాకతీయ వర్సిటీ |
వాకాటి కరుణ |
అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ |
రిజ్వీ |
తెలంగాణ వర్సిటీ |
సందీప్ సుల్తానియా |
తెలుగు యూనివర్సిటీ |
శైలజా రామయ్యర్ |
మహాత్మాగాంధీ వర్సిటీ |
నవీన్ మిట్టల్ |
శాతవాహన వర్సిటీ |
సురేంద్ర మోహన్ |
జేఎన్‌ఎఎఫ్‌ఏ వర్సిటీ |
జయేశ్ రంజన్ |
పాలమూరు వర్సిటీ |
నదీం అహ్మద్ |