TG ICET 2025 Applications : మార్చి 10 నుంచి ఐసెట్ 2025కు దరఖాస్తులు ప్రారంభం.. ముఖ్యమైన వివరాలివే..

సాక్షి ఎడ్యుకేషన్: డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు చాలామంది పీజీ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. అందలోనూ.. ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల్లో డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఈ కోర్సుల్లో విద్యార్థులు ప్రవేశాలకు పొందాలంటే, రాయాల్సిన పరీక్ష ఐసెట్.. ఈ పరీక్ష కోసం ఏటా నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దరఖాస్తులు చేసుకున్న తరువాత అభ్యర్థులకు ఎంపిక పరీక్షను నిర్వహించి, ఉత్తీర్ణత సాధించివారికి సీట్లు కేటాయిస్తారు.
అర్హతలు..
ఎంబీఏ కోర్సుకు: ప్రవేశ పరీక్షలో కనీసం 50% మార్కులతో (రిజర్వ్‌డ్ కేటగిరీల విషయంలో 45% మార్కులు) కనీసం మూడు సంవత్సరాల వ్యవధి గల గుర్తింపు పొందిన బ్యాచిలర్స్ డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
Infosys Employees : ఇకపై ప్రతీ ఉద్యోగి ఆఫీసుకు రావాల్సిందే.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం..!!
ఎంసీఏ కోర్సుకు: పది, ఇంటర్ స్థాయిలో గణితంతో అర్హత పరీక్షలో కనీసం 50% మార్కులతో (రిజర్వ్‌డ్ కేటగిరీల విషయంలో 45% మార్కులు) కనీసం మూడు సంవత్సరాల వ్యవధి గల గుర్తింపు పొందిన బ్యాచిలర్స్ డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
డిస్టెన్స్ మోడ్ ప్రోగ్రామ్ నుంచి పొందిన అర్హత డిగ్రీకి యూజీసీ, ఏఐసీటీఈ, డీఈసా సంయుక్త కమిటీ గుర్తింపు ఉండాలి.
దరఖాస్తులు.. ఫీజులు.. వివరాలు..
ఐసెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునేందుకు గడువును ప్రకటించారు.
ఈ దరఖాస్తులను రుసుముతో ఆన్‌లైన్‌లోనే.. మార్చి 10వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.550, మిగతా వారికి రూ.750తో చేసుకోవచ్చని, గడవు ముగిసిన తరువాత దరఖాస్తులు చేసుకోవాలంటే, వారికి రూ.50 ఆలస్య రుసుముతో మే 17 వరకు, రూ.500 ఫీజుతో మే 26 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇక, ప్రవేశ పరీక్ష విషయానికొస్తే.. జూన్ 8, 9 తేదీల్లో పరీక్ష జరుగుతుందని, పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీ ని జులై 7వ తేదీన విడుదల చేస్తామని పేర్కొన్నారు.
పరీక్ష విధానం..
జూన్‌లో నిర్వహించే ఐసెట్ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహిస్తారు. ఇది మొత్తం, 150 నిమిషాలు, అంటే రెండున్నర (2.5) గంటలపాటు, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- PG Entrance Exam
- icet 2025 notification
- march 10th
- icet exam applications
- online applications for icet
- icet 2025 entrance exam
- entrance exam important dates
- eligibilities for icet applications
- icet 2025 exam dates
- mba and mca admissions 2025
- mahatma gandhi university
- Integrated Common Entrance Test
- Integrated Common Entrance Test Notification 2025
- Post Graduation Entrance Exam
- icet online applications
- Education News
- Sakshi Education News
- ICETNotification
- ICETExamTips