Good News for Women Employees : మహిళలకు ఎల్ అండ్ టీ సంస్థ గుడ్ న్యూస్.. వేతనంతో కూడిన సెలవులు..

సాక్షి ఎడ్యుకేషన్: ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఎల్ అండ్ టీ సంస్థ శుభవార్త చెప్పింది. ఇకపై, ఆ సంస్థలో పని చేసే ప్రతీ మహిళకు నెలసరి సెలవు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతీ నెల మహిళలకు నెలసరితో ఉండే ఇబ్బందులకు సెలవులు కావాల్సి వస్తాయి. అయితే, ఎల్ అండ్ టీ సంస్థ ఈ ఇబ్బందులను గ్రహించి అక్కడ పని చేసే ప్రతీ మహిళకు సాధారణ సెలవు కాకుండా, వేతనంతో కూడిన సెలవును ప్రకటించారు.
మొత్తం పన్నెండు (12)..
ఎల్ అండ్ టీలో పని చేసే మహిళలకు వేతనంతో కూడిన నెలసరి సెలవులను ప్రకటించింది. అంటే, ఏడాదికి 12 సెలవులు అన్నమాట. ఇక, మార్చి 8వ తేదీ.. అంటే, రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో ఈ సందర్భంగా తమ నిర్ణయాన్ని ప్రకటించింది ఎల్ అండ్ టీ సంస్థ. ఇక, ఈ సెలవును ఎలా అమలు చేస్తారనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు పేర్కొంది సంస్థ.
Telangana School Holiday: విద్యార్థులకు శుభవార్త.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
5 వేలమంది..
ఈ విషయాన్ని తెలుసుకున్న ఉద్యోగినిలు వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 5 వేల మందికి లబ్ధి కలగనుంది. దేశంలో ఇలాంటి సెలవును ప్రకటించడం ఇంజినీరింగ్ & కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఇదే తొలిసారి. ఉద్యోగాలు చేస్తున్న మరికొందరు మహిళలు వారికి కూడా ఇలాంటి సెలవులు వస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Good News for Women
- Women's day Special
- l and t women worker
- menstrual leave
- paid leaves for women
- monthly leaves for l and t women
- Larsen and Toubro
- Larsen and Toubro Women Workers
- women's day 2025
- women's menstrual leave in l and t company
- monthly paid leaves for women
- good news for l and t women workers
- Education News
- Sakshi Education News