Skip to main content

VC Ravinder Gupta: ఏసీబీ వ‌ల‌కు చిక్కిన తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్‌ గుప్తా

తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌ దాచేపల్లి రవీందర్‌ గుప్తా(63) తమ అదుపులోనే ఉన్న విషయాన్ని ఏసీబీ డీఎస్సీ సుదర్శన్‌ ప్రకటించారు. అయితే ఆయన్ని ఇంకా అరెస్ట్‌ చేయలేదని.. పూర్తి స్థాయిలో తనిఖీలు ముగిశాక అరెస్ట్‌ చేస్తామని స్పష్టత ఇచ్చారు.
ఏసీబీ వ‌ల‌కు చిక్కిన తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్‌ గుప్తా
ఏసీబీ వ‌ల‌కు చిక్కిన తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్‌ గుప్తా

సాక్షితో మాట్లాడిన ఆయన.. శనివారం జరిగిన పరిణామాలను వివరించారు.  

సివిల్స్‌లో స‌బ్జెక్ట్‌ల వారీగా టాప్ స్కోర‌ర్లు వీరే... ఏ ఒక్క స‌బ్జెక్ట్‌లోనూ టాప్‌లో లేని టాప్ ర్యాంక‌ర్ ఇషితా

తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రవీందర్ గుప్తా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. తార్నాకలోని తన ఇంట్లోనే బాధితుడి నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడాయన. ఆయన అల్మారా నుంచి నగదును సేకరించి.. కెమికల్‌ టెస్ట్‌ నిర్వహించి వేలిముద్రలతో పోల్చి చూసుకున్నాం. ఆ వేలిముద్రలు ఆయన ఫింగర్‌ ప్రింట్స్‌తో సరిపోలాయి.  

VC Ravinder Gupta

నిజామాబాద్‌ భీమ్గల్ లో ఉన్న ఓ కళాశాలకు పరీక్ష కేంద్రం అనుమతి కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారాయన. ఈ క్రమంలో బాధితుడు దాసరి శంకర్‌ మమ్మల్ని ఆశ్రయించాడు.  దీంతో రంగంలోకి దిగి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆయన్ని అదుపులోని తీసుకున్నాం.  గతంలో అతని పై వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతం అతని నివాసంతో పాటు యూనివర్సిటీలోనూ సోదాలు చేస్తున్నాం. సోదాలు పూర్తి అయినా తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తాం అని డీఎస్పీ సుదర్శన్‌ వెల్లడించారు.

లా వైపు అడుగులు వేస్తున్న‌ ఎంబీబీఎస్‌, బీడీఎస్ విద్యార్థులు... 60 ఏళ్ల వృద్ధులు కూడా ఇటు వైపే... పూర్తి వివ‌రాలు ఇవే...

acb

ఇదిలా ఉంటే.. వీసీ రవీందర్‌ తీరుపై మొదటి నుంచి విమర్శలే వినవస్తున్నాయి. గతంలో ఆయన పలుమార్లు వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా.. ఆయనపై ఆరోపణల నేపథ్యంలోనే అక్రమాలు-అవకతవకలపై యూనివర్సిటీలో ఏసీబీ తనిఖీలు కూడా జరిగాయి. అయినా కూడా ఆయన తీరు మార్చుకోకుండా.. లంచంతో పట్టుబడడం గమనార్హం. 

Published date : 17 Jun 2023 06:51PM

Photo Stories