Skip to main content

TS LAWCET 2023: లా వైపు అడుగులు వేస్తున్న‌ ఎంబీబీఎస్‌, బీడీఎస్ విద్యార్థులు... 60 ఏళ్ల వృద్ధులు కూడా ఇటు వైపే... పూర్తి వివ‌రాలు ఇవే...

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయశాస్త్ర కళాశాలల్లో 2023 విద్యా సంవత్సరంలో లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన‌ లాసెట్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి.
లా వైపు అడుగులు వేస్తున్న‌ ఎంబీబీఎస్‌, బీడీఎస్ విద్యార్థులు
లా వైపు అడుగులు వేస్తున్న‌ ఎంబీబీఎస్‌, బీడీఎస్ విద్యార్థులు

న్యాయ విద్య అభ్యసించేందుకు వివిధ రంగాల వారు ముందుకొస్తున్నారు. ఉన్నత విద్యావంతులు, అధికారులు, ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో బీటెక్‌, ఎంబీబీఎస్‌ వంటి ఉన్నత విద్య పూర్తి చేసిన వారు ఉండటం విశేషం. 

NEET 2023 Ranker Success Story : కాశీ పురోహితుని కుమారుడు.. రోజూ గంగా హారతి ఇస్తూ.. నీట్ ర్యాంకు సాధించిన విభూ ఉపాధ్యాయ

సాధార‌ణంగా లా నేర్చుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రు అనుకుంటుంటారు. చ‌ట్టం తెలిస్తే మ‌న చుట్టం అవుతుంద‌ని చాలా మంది భావిస్తుంటారు. 60 ఏళ్ల వ‌య‌సు పైబ‌డిన వారు కూడా లా రాస్తున్నారు. లా అంటే మ‌క్కువ‌తో చాలా మంది ఉద్యోగం నుంచి రిటైర్ అయిన త‌ర్వాత త‌మ అభిరుచిని చంపుకోలేక ఇటు వైపు అడుగులు వేస్తున్నారు.

lawcet

తాజాగా విడుద‌లైన టీఎస్ లా సెట్ ఫ‌లితాలు ఈ విష‌యాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది ఫ‌లితాల్లో 60 ఏళ్లు.. ఆ పైన వ‌య‌సు ఉన్న వారు మూడేళ్ల లా కోర్సులో 149 మంది అర్హ‌త‌ సాధించారు. అయిదేళ్ల లా సెట్‌కు 9 మంది, పీజీఎల్ఎం కు 65 మంది అర్హ‌త‌ సాధించారు. 

ఇక 41 నుంచి 50 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారు మూడేళ్ల లాసెట్‌కు 1,999 మంది, అయిదేళ్ల లా సెట్‌కు 187 మంది, పీజీఎల్ సెట్‌కు 422 మంది అర్హ‌త సాధించారు. 

AP LAWCET 2023: ఏపీ లాసెట్‌ 2023 ఫలితాలు... డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి

51 నుంచి 60 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారు మూడేళ్ల లాసెట్‌కు 427 మంది, అయిదేళ్ల లా సెట్‌కు 53 మంది, పీజీఎల్ సెట్‌కు 116 మంది అర్హ‌త సాధించారు. 

lawcet

ఇక విద్యార్హ‌త‌ల ప‌రంగా బీకాం చ‌దివిన వారు 8,164 మంది, బీఎస్సీ నుంచి 6,232 మంది, బీఏ 5,614 మంది, బీటెక్ 4,603 మంది బీఫార్మ‌సీ 361 మంది, బీబీఏ 308 మంది, బీసీఏ 125 మంది ఉన్నారు. 

TS LAWCET-2023 Results Links : లాసెట్-2023 ఫలితాలు విడుదల.. రిజ‌ల్డ్స్‌ డైరెక్ట్ లింక్స్ ఇవే..

ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే ఎంబీబీఎస్‌, బీడీఎస్ పూర్తి చేసిన వారు కూడా లా సెట్ రాశారు. వీరిలో ఎంబీబీఎస్ చేసిన వారు 53 మంది, హోట‌ల్ మేనేజ్‌మెంట్ 53 మంది, బీడీఎస్ 32 మంది, ఫార్మాడీ 13 మంది లా సెట్‌లో ఉత్తీర్ణ‌త సాధించారు. 

Published date : 17 Jun 2023 03:58PM

Photo Stories