Skip to main content

TS Lawcet Schedule 2023 : టీఎస్ లాసెట్ షెడ్యూల్ విడుద‌ల‌.. ప‌రీక్ష ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలోని న్యాయ విశ్వవిద్యాలయాలు/వాటి అనుబంధ కళాశాలల్లో.. లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష.. టీఎస్‌ లాసెట్‌ 2023 షెడ్యూల్ విడుదలైంది.
TS Lawcet Schedule 2023 timetable
TS Lawcet Schedule 2023 Details telugu

మార్చి 1వ తేదీ నుంచి లాసెట్, పీజీ ఎల్‌సెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వ‌ర‌కు అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 

Also Read: న్యాయవిద్యకు దారులెన్నో...!

ఫీజుల వివ‌రాలు ఇవే..
ఓపెన్ కేట‌గిరి అభ్య‌ర్థులకు రూ. 900, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థుల‌కు రూ. 600గా ద‌ర‌ఖాస్తు ఫీజు నిర్ధారించారు. రూ. 500 ఆల‌స్య రుసుంతో ఏప్రిల్ 12 వ‌ర‌కు, రూ. 1000తో ఏప్రిల్ 19 వ‌ర‌కు, రూ. 2 వేల‌తో ఏప్రిల్ 26 వ‌ర‌కు, రూ. 4 వేల‌తో మే 3వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించొచ్చు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు ఎడిట్ చేసుకునేందుకు మే 5 నుంచి 10వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించారు.

Success Story: మొదటి పరీక్షలోనే న్యాయమూర్తిగా ఎంపికయ్యానిలా..

ప‌రీక్ష తేదీ ఇదే.
మే 16వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవ‌చ్చు. మే 25వ తేదీన‌ టీఎస్ లాసెట్‌, టీఎస్ పీజీ ఎల్‌సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ను ఆన్‌లైన్‌లో నిర్వ‌హించ‌నున్నారు. టీఎస్ లాసెట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా యూనివ‌ర్సిటీ వీసీ డి ర‌వీందర్, లాసెట్ క‌న్వీన‌ర్ బీ విజ‌య‌లక్ష్మి క‌లిసి విడుద‌ల చేశారు.

☛ ‘ లా’ కెరీర్‌తో విస్తృత అవకాశాలు...

అర్హతలు ఇవే..
మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు ఏదేని విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యను పూర్తిచేసి ఉండాలి. వీరు బీఏ+ఎల్‌ఎల్‌బీ, బీకామ్‌+ఎల్‌ఎల్‌బీ, బీబీఏ+ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ+ఎల్‌ఎల్‌బీ చేసే అవకాశం ఉంది.

ఎంపిక ప్రక్రియ.. ప‌రీక్షావిధానం ఇలా..
తెలంగాణ స్టేట్‌ లెవల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ లాసెట్‌) పరీక్ష ద్వారా అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో మొత్తం 120 మార్కులకు గాను 120 ప్రశ్నలకు ఉంటుంది. 3 పార్ట్‌లుగా పరీక్షను నిర్వహిస్తారు. అవి..

☛ కరెంట్‌ ఆఫైర్స్‌ : ఈ విభాగంలో 30 ప్రశ్నలు–30 మార్కులకు పరీక్ష ఉంటుంది.

☛ జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ : ఈ విభాగంలో 30 ప్రశ్నలు–30 మార్కులుంటాయి.

☛ అప్టిట్యూడ్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ లా : ఈ విభాగం నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.

   మూడు విభాగాలకు కలిపి పరీక్ష సమయం 90 నిమిషాలు. ఎటువంటి నెగిటివ్‌ మార్కుల విధానం లేదు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో పరీక్షను రాసుకోవచ్చు.

ఈసెట్‌-2023షెడ్యూల్ ఇదే..

ts ecet notification 2023

తెలంగాణ‌లోని ఇంజినీరింగ్ కాలేజీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే టీఎస్ ఈసెట్‌-2023షెడ్యూల్ విడుద‌లైంది. మార్చి 1వ తేదీన టీఎస్ ఈసెట్‌ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్నారు. మార్చి 2వ తేదీ నుంచి మే 5వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. రూ. 500 ఆల‌స్యం రుసుంతో మే 8వ తేదీ వ‌ర‌కు, రూ. 2,500తో మే 12వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు తమ ద‌ర‌ఖాస్తుల‌ను మే 8 నుంచి మే 12వ తేదీ వ‌ర‌కు ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. 

Engineering college Admissions : ఇంజ‌నీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?

హాల్ టికెట్లు మాత్రం..
మే 15వ తేదీ నుంచి అభ్య‌ర్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవ‌చ్చు. మే 20వ తేదీ ఈసెట్ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

Engineering‌ Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోస‌మే!

Published date : 27 Feb 2023 06:53PM

Photo Stories