Skip to main content

LAWCET 2024 Notification: టీఎస్‌ లాసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల, ముఖ్యమైన తేదీలు ఇవే

LAWCET 2024 Notification TS LAWCET 2024 Notification

లా కోర్సుల్లో ప్రవేశాలకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ లాసెట్‌, పీజీలాసెట్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 

కోర్సులు: మూడు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులు, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు.
అర్హత:  మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యను పూర్తిచేసి ఉండాలి. ఎల్ఎల్ఎం చేయాలనుకునే వారు.. డిగ్రీతో పాటు ఎల్ఎల్ బీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

TS ECET & LAWCET 2024 Schedule: ఈసెట్, లాసెట్‌ షెడ్యూల్‌ విడుదల​​​​​​​

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తు ప్రారంభ తేది: మార్చి 1, 2024 నుంచి
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 15, 2024

లాసెట్‌ ప్రవేశ పరీక్ష తేది: జూన్‌ 3, 2024

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://lawcet.tsche.ac.in/ ను సంప్రదించండి. 

Published date : 10 Feb 2024 03:55PM

Photo Stories