Skip to main content

AP LAWCET 2024: రేపే లాసెట్‌ ప్రవేశ పరీక్ష.. వెంట ఇవి తెచ్చుకోవాల్సిందే

AP LAWCET 2024

ఏఎన్‌యూ: ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఏపీ లాసెట్, ఏపీ పీజీ లాసెట్‌– 2024 పరీక్షలను ఈ నెల 9న మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కన్వీనర్‌ ఆచార్య బి.సత్యనారాయణ తెలిపారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

ఏపీ లాసెట్‌లో సాధించిన ర్యాంక్‌ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లా కళాశాలల్లో  ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు.ఏపీ లాసెట్‌కు 23,425 దరఖాస్తులు వచ్చాయన్నారు. పురుషులు 15,374 మంది, మహిళలు 8,051 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అభ్యర్థులు  https://cets. ap­sche.­ap.gov.in  ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.

Vacancies In High Court: హైకోర్టుల్లో 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీలు.. వివరాలు ఇవే

పరీక్ష కేంద్రానికి హాల్‌టికెట్‌తోపాటు ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తేవాలన్నారు. పరీక్ష నిర్వహణ కోసం 105 పరీక్షా కేంద్రాలను ఏ­ర్పాటు చేశామని వెల్లడించారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులను జూన్‌ 9న మధ్యాహ్నం 1.00 నుంచి 2.30 గంటల వరకు అనుమతిస్తామన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు.

Published date : 08 Jun 2024 09:17AM

Photo Stories