KU LLB Exam Schedule: కేయూ ఎల్‌ఎల్‌బీ పరీక్షల షెడ్యూల్ విడుదల
అక్టోబర్ 17, 19, 21, 25వ తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్విహించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కేయూ పరిధిలో ఎల్‌ఎల్‌ఎం రెండో సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 16నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
మొదటి పేపర్ అక్టోబర్ 16న, రెండో పేపర్ 18న, మూడో పేపర్ 21 తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికా రి డాక్టర్ నాగరాజు తెలిపారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ.ఇన్‌లో చూడొచ్చని సూచించారు.
చదవండి: Contract Jobs: కేజీబీవీల్లో కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
నేడు సైన్స్ డ్రామా పోటీలు
విద్యారణ్యపురి: జిల్లా స్థాయిలో హైస్కూల్ విద్యార్థులకు ఈనెల 30న(సోమవారం) సైన్స్ డ్రామా పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ వాసంతి, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి తెలిపారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని రీజినల్ సైన్స్ సెంటర్‌లో ఈపోటీలుంటాయని పేర్కొన్నారు.
‘ప్రపంచ నీటి సంక్షోభం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సొసైటీ, విపత్తు నిర్వహణ కోసం ఆధునిక సాంకేతికతలు, ఆరోగ్య, శుభ్రత, వాతావరణ మార్పు దాని ప్రభావం’ అంశాలపై పోటీలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈనెల 30న ఉదయం 9 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు.