Vacancies In High Court: హైకోర్టుల్లో 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీలు.. వివరాలు ఇవే
సాక్షి, అమరావతి: దేశంలోని వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే రాష్ట్రాల్లోని జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 5,432 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. సుప్రీం కోర్టుతో పాటు వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది.
వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ
న్యాయమూర్తులు పదవీ విరమణ, రాజీనామాలు, పదోన్నతుల ద్వారా ఖాళీ అయిన న్యాయమూర్తుల పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో న్యాయమూర్తుల ఎంపిక, నియామకాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపింది.
Teacher Jobs Notification: భారీగా ఉపాధ్యాయ పోస్టులు
ఏపీ, తెలంగాణలో ఎన్ని ఖాళీలున్నాయంటే..
అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 70 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆ తరువాత పంజాబ్, హరియాణ హైకోర్టులో 29 న్యాయమూర్తుల పోస్టులు, బాంబే హైకోర్టులో 25 న్యాయమూర్తుల పోస్టులు, కోల్‌కత్తా, గుజరాత్ హైకోర్టుల్లో 21 చొప్పున న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది. తెలంగాణలో 16, ఏపీలో 7 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయంది.
Telangana Medical Jobs 2024 : 5348 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. త్వరలోనే..!
ఉత్తరప్రదేశ్‌లో జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 1,250 జడ్జిల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, గుజరాత్‌లో జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 535 న్యాయమూర్తుల పదవులు, బిహార్‌లో జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 467 జడ్జిల పోస్టులు, తమిళనాడులో జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 334 న్యాయమూర్తుల పోస్టులు, రాజస్థాన్‌లో జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 300 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయంది. ఏపీలో జిల్లాలు, సబారి్టనేట్ కోర్టుల్లో 84, తెలంగాణలో 115 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది.