Skip to main content

AP ECET & ICET Results 2024: నేడు ఈసెట్‌, ఐసెట్‌ ఫలితాలు విడుదల

AP ECET & ICET Results 2024  Official announcement of ESET-2024 results

రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్‌-2024 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి,ఈసెట్‌ ఛైర్మన్‌ శ్రీనివాసరావు ఫలితాలను వెల్లడించనున్నారు.

కాగా ఈనెల 8న ఏపీ ఈసెట్‌-2024 పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈసెట్‌ ఫలితాల్లో 90.41 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. 

How to check AP ECET Results 2024:

  1. results.sakshieducation.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న AP ECET 2024 ఫలితాలు లింక్‌పై క్లిక్ చేయండి.
  3. మీ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి, సమర్పించు క్లిక్ చేయండి.
  4. మీ AP ECET 2024 మార్కులు మరియు ర్యాంక్ ప్రదర్శించబడతాయి.
  5. తదుపరి సూచనల కోసం ఫలితాలను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

AP 10th Class Re Verification: చదువులో టాపర్‌.. 82 మార్కులు వస్తే 18 వేసి ఫెయిల్‌ చేశారు.. బయటపడిన ఇన్విజిలేటర్‌ నిర్లక్ష్యం

ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా  పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశాలు పొందవచ్చు. ఇదిలా ఉంటే ఈసెట్‌తో పాటు ఏపీ ఐసెట్‌ 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు కూడా నేడు(మే30)వ తేదీనే విడుదల చేస్తున్నట్లు ఐసెట్‌ కన్వీనర్‌ మురళీకృష్ణ తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 44,446 మంది పరీక్షకు హాజరయ్యారు. 

How to check AP ICET Results 2024:

  1. results.sakshieducation.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న AP ICET 2024 ఫలితాలు లింక్‌పై క్లిక్ చేయండి.
  3. మీ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి, సమర్పించు క్లిక్ చేయండి.
  4. మీ AP ECET 2024 మార్కులు మరియు ర్యాంక్ ప్రదర్శించబడతాయి.
  5. తదుపరి సూచనల కోసం ఫలితాలను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
Published date : 30 May 2024 11:25AM

Photo Stories