Skip to main content

TS ECET 2024 Counselling Dates : టీఎస్ ఈసెట్‌-2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : టీఎస్ ఈసెట్‌-2024 ఫ‌లితాల‌ను ఇటీవ‌లే విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. అలాగే తెలంగాణ ఉన్న‌త విద్యా మండ‌లి మే 24వ తేదీ(శుక్ర‌వారం) టీఎస్ ఈసెట్‌-2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది.
TS ESET  2024 Results Announcement  Telangana ECET 2024 Counselling Dates  Telangana Higher Education Council Counseling Schedule for TS ESET 2024

లేటరల్‌ ఎంట్రీ ద్వారా పాలిటెక్నిక్‌ డిప్లొమో విద్యార్థులు బీటెక్‌, బీఫార్మసీ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు పొందడం కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. టీఎస్ ఈసెట్‌-2024 మొదటి విడతలో జూన్‌ 8వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు అభ్యర్థులు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. స్లాట్ బుక్‌ చేసుకున్న అభ్యర్థులకు జూన్‌ 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. అలాగే జూన్ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. జూన్‌ 18న తొలి విడత సీట్లను కేటాయిస్తారు.

☛➤ TS EAMCET 2024 Counselling Important Dates : టీఎస్ ఈఏపీసెట్-2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే..

టీఎస్ ఈసెట్‌-2024 రెండో విడత షెడ్యూల్ ఇలా..
➤ జూలై 15వ తేదీ నుంచి తుది విడత ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది.
➤ జూలై 21న తుది విడత సీట్లను కేటాయిస్తారు.
➤ జూలై 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్పాట్‌ ఆడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నారు.

Published date : 25 May 2024 11:42AM

Photo Stories