Skip to main content

TS ECET 2024 Results: ఈ–సెట్‌లో 95.86% పాస్‌... వివిధ విభాగాల్లో తొలి ఐదు ర్యాంకర్లు వీరే...

సాక్షి, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈ–సెట్‌) పలితాలను మే 20న‌ విడుదల చేశారు.
TS ECET 2024 Results    ECET result announcement

ఇందులో 95.86 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. బాలురు 95.20 శాతం పాసయితే, బాలికలు 97.22 శాతం ఉత్తీర్ణత సాధించారు. 11 విభాగాల్లో నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలో ఎక్కువ మంది బాలురే టాప్‌ ర్యాంకులు దక్కించుకున్నారు.

ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌లో మాత్రం మొదటి ఐదు ర్యాంకుల్లో నాలుగు ర్యాంకులు అమ్మాయిలకే దక్కాయి. కెమికల్‌ ఇంజనీరింగ్‌లో మొదటి ఐదు ర్యాంకులూ ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకే వచ్చాయి.

చదవండి: ఇంజనీరింగ్‌ - జాబ్ గైడెన్స్ | ప్రాజెక్ట్ గైడెన్స్ | సక్సెస్ స్పీక్స్ | గెస్ట్ స్పీక్స్ | న్యూస్

అర్హత సాధించిన 22,365 మంది విద్యార్థులు 

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6వ తేదీన ఈసెట్‌ జరిగింది. 24,272 మంది ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేశారు. వీరిలో 23,330 మంది పరీక్ష రాశారు. 22,365 మంది అర్హత సాధించారు.  ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి  ఫలితాలను విడుదల చేయగా, ఈ  కార్యక్రమంలో మండలి వైస్‌ చైర్మన్లు ప్రొఫెసర్‌ మహమ్మూద్, ప్రొఫెసర్‌ వెంకటరమణ, మండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్‌ డి రవీందర్, టీఎస్‌ఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

పాస్‌ అయిన  ప్రతి ఒక్కరికీ సీట్లు రావొచ్చు

టీఎస్‌ ఈసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను జూన్‌ రెండో వారం నుంచి ప్రారంభిస్తున్నట్టు మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు. ఈ సెట్‌ ద్వారా భర్తీ చేసే ఇంజనీరింగ్‌ సీట్లు రాష్ట్రంలో 25,288 ఉన్నట్టు చెప్పారు. త్వరలో ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ ఇస్తామన్నారు. డిప్లొమా కోర్సులకు ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతోందని, క్యాంపస్‌ నియామకాల్లో మంచి వేతనాలతో కూడిన ఉద్యోగాలు వస్తున్నాయన్నారు.

రాత్రిపూట క్లాసులు నిర్వహించే విధానాన్ని తీసుకొస్తున్నామని ఆయన వెల్లడించారు. కెమికల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సులు తెలంగాణలో లేవని, అందుకే ఏపీ విద్యార్థులే ఈ కోర్సు రాసినట్టు తెలిపారు. ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికీ సీట్లు వస్తాయన్న ఆశాభావాన్ని లింబాద్రి వ్యక్తం చేశారు.

వివిధ విభాగాల్లో తొలి ఐదు ర్యాంకర్లు వీరే...

సివిల్‌ ఇంజనీరింగ్‌

పేరు

ప్రాంతం

గెడోల్లు సుధాకర్‌రెడ్డి

కూకట్‌పల్లి, మేడ్చల్‌

అచ్చన అనిల్‌కుమార్‌

కొణిజిర్ల, ఖమ్మం

టి రఘువర్థన్‌

జోగుళాంబ గద్వాల్‌

వీరమల్ల వంశీకృష్ణ

మంచాల, రంగారెడ్డి

గుగులోత్‌ అఖిల

మైలారం, వరంగల్‌

ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌

అలువల గణేష్‌

పగడపల్లి, జగిత్యాల

టి, శ్రీవత్సవ్‌

భూపాలపల్లి

తుపాకుల శ్రీరామ్‌

రాజన్న సిరిసిల్ల

మేడిపల్ల కౌశిక్‌కుమార్‌

హనుమకొండ

బూదాటి దొరబాబు

గన్నవరం, ఆంధ్రప్రదేశ్‌

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌

మేడిశెట్టి నవ్యశ్రీ

శంకరపట్నం, కరీంనగర్‌

వేముల వైష్ణవ్‌

కొత్తవాడ, వరంగల్‌

ఉరాడి రవళి శ్రీ

స్టేషన్‌ ఘన్‌పూర్, జనగామ

న్యాలకొండ శ్వేత

రాజన్న సిరిసిల్ల

వి అశ్రిత

తిమ్మాపూర్, కరీంనగర్‌

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌

పంచదార సాయి అశ్రిత్‌

మేడ్చల్, మల్కాజిగిరి

లవంగ సాయి విజ్ఞేష్‌

అల్వాల్, హైదరాబాద్‌

నానవేణి దీక్షిత్‌

జమ్మికుంట, కరీంనగర్‌

పూల వివేక్‌

గీసుకొండ, వరంగల్‌

రితీష్‌ జింజీరపు

పెగడపల్లి, జగిత్యాల

మెకానికల్‌

కిల్లి శ్రీరాం

విశాఖపట్నం

కందికొండ చందు

దుగ్గొండి, వరంగల్‌

తేజావత్‌ సాత్విక్‌

భద్రాద్రి కొత్తగూడెం

వీరమల్ల గణేష్‌

గట్టుపల్లి, నల్లగొండ

పి శివకుమార్‌

చిగురుమామిడి, కరీంనగర్‌

విభాగాల వారీగా అర్హత

విభాగం

పరీక్ష రాసిన వారు

ఉత్తీర్ణులు

శాతం

కెమికల్‌ ఇంజనీరింగ్‌

187

173

92.51

సివిల్‌ ఇంజనీరింగ్‌

3609

3496

96.87

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌

4131

4057

98.21

ఎలక్ట్రానిక్స్, కమూనికేషన్స్‌

6002

5892

98.17

ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌

5407

4889

90.42

ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌

147

144

97.96

మెకానికల్‌ ఇంజనీరింగ్‌

3340

3221

96.44

మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌

83

80

96.39

మైనింగ్‌ ఇంజనీరింగ్‌

348

338

97.13

బీఎస్సీ (మేథ్స్‌)

10

10

100

ఫార్మసీ

66

65

98.48

మొత్తం

23330

22365

95.86

Published date : 21 May 2024 05:28PM

Photo Stories