AP LAWCET 2023: ప్రవేశ పరీక్ష తేదీ ఇదే..
ఈ ఏడాది సెట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఏఎన్‌యూలో మే 18న ఆయన విలేకరులతో మాట్లాడారు. 20న మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 నగరాల్లో 84 ఆన్‌లైన్ కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని చెప్పారు. ఫలితాలు జూన్ 15న ప్రకటించి ర్యాంకులు 16న విడుదల చేస్తామన్నారు.
చదవండి: లాసెట్ - స్టడీ మెటీరియల్ | లా ఆప్టిట్యూడ్ | అర్థిమేటిక్ | రీజనింగ్ | గైడెన్స్ | కరెంట్ అఫైర్స్ | జనరల్ నాలెడ్జ్
మొదటి విడత అడ్మిషన్లు ఆగస్టు 16–24 వరకు, రెండో విడత అడ్మిషన్లు అక్టోబర్ 1–7 వరకు, స్పాట్ అడ్మిషన్లు, కేటగిరీ–బి అడ్మిషన్లు అక్టోబర్ 15–22 వరకు జరుగుతాయన్నారు. తరగతులు అక్టోబర్ 11 నుంచి మొదలవుతాయని తెలిపారు. ఏఎన్‌యూ రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య బి.కరుణ, సెట్ కో కన్వీనర్ ఆచార్య నాగరాజు, దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ బి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.