Teachers Promotions: ఎస్జీటీలకు న్యాయం చేయాలి
Sakshi Education
సిరిసిల్ల టౌన్: ప్రస్తుతం జరుగుతున్న పదోన్నతుల్లో ఎస్జీటీలకు తీవ్ర నష్ట జరుగుతుందని, దానిని తక్షణమే రద్దు చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దోర్నాల భూపాల్‌రెడ్డి, దుమాల రమానాథ్‌రెడ్డి కోరారు.
జూన్ 25న జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌కు వినతిపత్రం అందించి మాట్లాడారు. ఒకటి కంటే ఎక్కువ పదోన్నతులు పొందినవారు ఒక సబ్జెక్టుకు ఐశ్చికత ఇచ్చిన దరిమిలా ఏర్పడిన ఖాళీల్లో ఎస్జీటీలకు తక్షణమే పదోన్నతులు కల్పించి భర్తీ చేయాలని కోరారు.
పీఎస్‌హెచ్‌ఎం పోస్టులు అప్‌డేట్ చేసి బీఈడీ కలిగిన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని, పదోన్నతుల ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలన్నారు.
చదవండి:
School Teachers: మమ్మల్ని విడిచి వెళ్లొద్దు సార్.. కన్నీటి పర్యంతమైన విద్యార్థులు
Teacher Jobs: ఖాళీ పోస్టులతో అవస్థలు.. టీచర్లు లేక విద్యార్థులు ఇలా..
Published date : 27 Jun 2024 09:42AM