School Teachers: మమ్మల్ని విడిచి వెళ్లొద్దు సార్.. కన్నీటి పర్యంతమైన విద్యార్థులు
Sakshi Education
కుల్కచర్ల: విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు పాఠశాల అభ్యున్నతికి కృషి చేసిన తమ హెచ్‌ఎం బదిలీపై వెళ్లడాన్ని విద్యార్థులు తట్టుకోలేకపోయారు.
‘మమ్మల్ని వదిలి.. మీరు వెళ్లొద్దు సార్’ అంటూ కంటతడి పెట్టుకున్నారు. గురువుగా పాఠాలు చెప్పడంతో పాటు తండ్రిలా బంధాన్ని పెనవేసుకున్న తమ సార్ మరో స్కూల్‌కు వెళ్తున్నారని తెలిసి ఆవేదనకు గురయ్యారు.
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని చౌడాపూర్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్న తిమ్యా, ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భాస్కర్ స్కూల్ అసిస్టెంట్ల బదిలీల్లో భాగంగా మరో చోటకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు.
చదవండి: Teacher Jobs: ఖాళీ పోస్టులతో అవస్థలు.. టీచర్లు లేక విద్యార్థులు ఇలా..
మంగళవారం విధుల నుంచి రిలీవ్ అయి వెళ్తుండగా.. విద్యార్థులు వెక్కివెక్కి ఏడ్చారు. వారిని ఊరడించిన మాస్టారు.. ‘బాగా చదువుకోండి. మిమ్మల్ని చూసేందుకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తాం’ అని చెప్పి బరువెక్కిన హృదయంతో బైబై చెప్పుకుంటూ వెళ్లిపోయారు.
Published date : 26 Jun 2024 01:37PM