Skip to main content

Good News: లెక్చరర్ల వేతనం భారీగా పెంపు

రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాన్ని పెంచుతూ నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి జి.జయలక్ష్మి జనవరి 11న మెమో జారీ చేశారు.
Increase in salaries of polytechnic contract lecturers
పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్ల జీతాలు పెంపు

వీరికి సవరించిన మినిమమ్‌ టైమ్‌ స్కేలు ప్రకారం వేతనాలు చెల్లించేలా ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఈ కాంట్రాక్టు అధ్యాపకులు రూ.35,120 పొందుతుండగా తాజా ఆదేశాల ప్రకారం అది రూ.40,270కి పెరగనుంది. ఈ వేతనాలు ఉత్తర్వులు వెలువడిన నాటినుంచి అమలులోకి వస్తాయని మెమోలో పొందుపరిచారు. దీనివల్ల 316 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు మేలు జరగనుంది. తాము ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సవరించిన మినిమమ్‌ టైమ్‌ స్కేలు ప్రకారం వేతనాలు పెంచినందుకు పాలిటెక్నిక్‌ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం మంగళవారం ఓ ప్రకటనలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. తాము ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సవరించిన ఎంటీఎస్‌ను అమలు చేసినందుకు మంత్రి గౌతమ్‌రెడ్డి, ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవర్ధననాయుడు, బి.కృష్ణ పేర్కొన్నారు. 

చదవండి: 

GT Course: మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో జీటీ కోర్సు

పాలిటెక్నిక్‌ లెక్చరర్లకు ఏఐసీటీఈ వేతనాలు

పుంగనూరులో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల

Published date : 12 Jan 2022 12:38PM

Photo Stories