Skip to main content

పుంగనూరులో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల

సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా పుంగనూరులో కొత్తగా వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుపతిలో అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ ఉంది. దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుంగనూరు ప్రాంతానికి చెందిన వారు ఈ కాలేజ్‌లో చదువుకోడానికి రావడం దూరాభారంగా మారింది. దీంతో పుంగనూరులో ప్రత్యేకంగా వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల మంజూరు చేయాలంటూ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏడుగురు టీచింగ్‌ స్టాఫ్, 11 మంది నాన్ టీచింగ్‌ స్టాఫ్‌తో ఈ కళాశాల ఏర్పాటు కాబోతోంది. 20 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ కళాశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7 కోట్ల 81 లక్షల 19 వేలు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు.
Published date : 12 May 2021 03:34PM

Photo Stories