Women Success Story : ఇంట్లో ఉండే ప్రిపేర్ అయ్యా.. నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలను కొట్టానిలా.. కానీ..
బీఎడ్‌లో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు, ఎమ్మెస్సీ ఎంట్రెన్స్‌లో రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు సాధించా. 2022 లో ఎమ్మెస్సీ పూర్తి చేశాను. గురుకుల నోటిఫికేషన్ రాగా.. తల్లిదండ్రులు, ప్రొ ఫెసర్ల సహకారంతో శ్రద్ధగా చదివాను. పీజీటీలో రాష్ట్రస్థాయి లో 19వ ర్యాంకు, గురుకుల ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 83వ ర్యాంకు సాధించాను.
ఒకేసారి నాలుగు ఉద్యోగాలను..
నా పేరు దీపారెడ్డి. మాది తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా మానపాడు మండలం. ప్రస్తుతం మేము మియాపూర్‌లో నివాసం ఉంటున్నాం. నాకు చిన్నప్పటి నుంచే చదువంటే చాలా ఇష్టం. మా తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చాలని ప్రభుత్వ కొలువు సాధించేందుకు నిరంతరం చదివాను. నిజాం కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో బీఈడీ పూర్తి చేశాను.
ఇటీవల విడుదలైన తెలంగాణ జేఎల్, గురుకుల పీజీటీ, ఏకలవ్య మోడల్ స్కూల్ టీచర్, గురుకుల కళాశాల అధ్యాపక ఉద్యోగాలు సాధించాను. నా విజయంలో తల్లిదండ్రులతో పాటు నా భర్త సహకరం ఉంది. ఒకేసారి నాలుగు ఉద్యోగాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది.
☛ Success Story : వస్తే ఉద్యోగం.. లేకపోతే అనుభవం.. ఇదే ఆలోచనతో చదివా..మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..