Skip to main content

Telangana Women Secures Four Government Jobs : ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా. కానీ నా చూపు.. ఈ ఉద్యోగం వైపే..

ప్ర‌స్తుత రోజుల్లో ఒక ఉద్యోగం సాధించాలంటేనే ఒక చిన్న యుద్ధంమే చేయాలి. మ‌రి ఆడపిల్లలకు అయితే.. ఇంట్లో ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొన్ని ఉద్యోగం కొట్టలంటే.. క‌ష్ట‌మైన వ్య‌వ‌హార‌మే.
Deepa Reddy Secures Four Government Jobs

కానీ ఈమె మాత్రం ఒక వైపు చదువుకోవాలనే పట్టుదల ఉద్యగం సాధించాలనే తపన, మరో వైపు ఆడపిల్లలకు చదువులు వద్దనే ఆరోపణలకు ఎక్కడా కూడా కుంగిపోలేదు. తల్లిదండ్రుల కలను సాకారం చేయాలనే సంకల్పం దాని కోసం మూడేళ్లు నిర్విరామంగా కష్టపడి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించింది. ఈమె దీపారెడ్డి. ఈ నేప‌థ్యంలో దీపా స‌క్సెస్ స్టోరీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం : 
తెలంగాణ‌లోని జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన వారు బి.దీపారెడ్డి. ఈమె తండ్రి దేవసేనారెడ్డి. త‌ల్లి హేమలత. 

పోటీ పరీక్షలకు ప్రిపేర‌య్యే స‌మ‌యంలో..
పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ప్రభుత్వ ఉద్యోగం సాధించినట్లు దీపారెడ్డి తెలిపింది.

☛ IPS Manoj Kumar Sharma Inspiring Story : '12th Fail' ఫెయిల్.. బిచ్చగాళ్లతో పడుకున్నా..ఈ క‌సితోనే ఐపీఎస్ అయ్యా.. కానీ..

దీపా భర్త కూడా..
మా నమ్మకాన్ని నిజం చేస్తూ ఆమె సాధించిన ఈ విజయాలు మమ్మల్ని గర్వించేలా చేస్తున్నాయని తల్లిదండ్రులు దేవసేనారెడ్డి, హేమలత అన్నారు. 
అలాగే ఉద్యోగం సాధించాలలని కష్టపడి చదువుతున్నప్పుడు తన కూతురుకు వివాహం చేశామని దీపారెడ్డి తెలిపారు. అయితే దీపా భర్త పవన్ కుమార్ రెడ్డి సహకరించడంతో మంచిగా చదువుకుని ఉద్యోగాలు సాధించినట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. 

నాడు విమర్శకులు చేసిన వారే.. నేడు..
చిన్నప్పటి నుంచే చదువుకోలేని సంకల్పం ఉండడంతోనే దీప ప్రభుత్వ కొలువులను సాధించింది. విమర్శకులు చేసిన వారే ఇవాళ శభాష్‌ అంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం మూడేళ్లు కష్టపడినట్లు దీప తెలిపింది. మానోపాడు గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేసి దీపకు అభినందనలు తెలిపారు.

☛ IAS Officer Success Story : ఒక వైపు కరోనాతో తండ్రి మ‌ర‌ణం.. మ‌రో వైపు సివిల్స్ ఇంటర్వ్యూ.. చివ‌రికి..

నా చూపు.. ఈ ఉద్యోగం వైపే..
గురుకుల జూనియర్ లెక్చరర్, గురుకుల పీజీటీ, ఏకలవ్య మోడల్ స్కూల్ టీచర్, గురుకుల డిగ్రీ లెక్చరర్‌గా కొలువులు సాధించింది. అందులో తనకు ఇష్టమైన గురుకుల డిగ్రీ లెక్చరర్‌గా జాయిన్ అయ్యేందుకు దీప సిద్ధమైంది. ఆడపిల్లలకు చదువులు వద్దంటున్న వారందరికీ చదివించాలనే సంకల్పం అందరిలో కల్పిస్తానని ధీమా వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ ‌‌రెడ్డి చేతుల మీదుగా జాయినింగ్ లెటర్ తీసుకుంటానని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. కృషి, పట్టుదల ఉంటే ఎదైనా సాధించవచ్చని నిరూపించారు దీపారెడ్డి.

 ☛ IAS Success Story : మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ 2వ‌ ర్యాంక్ కొట్టా.. క‌లెక్ట‌ర్ అయ్యా.. కానీ నా భ‌ర్త..

Published date : 01 Mar 2024 04:03PM

Photo Stories