Success Story : వస్తే ఉద్యోగం.. లేకపోతే అనుభవం.. ఇదే ఆలోచనతో చదివా..మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..
ఈ యువకుడే.. తెలంగాణలోని ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామానికి చెందిన ఆంతోటి చక్రపాణి. ఈ నేపథ్యంలో ఆంతోటి చక్రపాణి సక్సెస్ జర్నీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
ఆంతోటి వెంకటేశ్వర్లు, కౌశల్యకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. చిన్న కుమారుడు ఆంతోటి చక్రపాణి. చక్రపాణిని తల్లిదండ్రులు కష్టపడి ఎంఎస్సీ బీఈడీ వరకు చదివించారు.
ఈ మూడు ఉద్యోగాలు ఇలా..
అనంతరం ఈ యువకుడు ఉద్యోగాల వేటలో భాగంగా 2023లో గురుకుల పోస్టులకు పరీక్షలు రాశాడు. ఇటీవలే మూడు విడతలుగా విడుదలైన బోర్డు ఫలితాల్లో టీజీటీ (ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్), పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్), జెఎల్ (జూనియర్ లెక్చరర్)గా ఉద్యోగాలను సాధించాడు. ఈ మూడు ఉద్యోగాల్లో తాను జేఎల్ లో చేరన్నట్టు పేర్కొన్నాడు.
కటిక పేదరికం సైతం తన సంకల్ప బలం ముందు ఓడించి విజయాన్ని తన వాకిట్లోకి తెచ్చుకున్నాడు. ఈ రోజుల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే ఎంతో గొప్ప విషయం. అలాంటిది ఈ యువకుడు ఏకంగా మూడు ఉద్యోగాలను సాధించి అందరి అభినందనలు పొందుతున్నాడు.
Tags
- telangana man secures three government jobs
- Anthony Chakrapani
- Success Story
- Inspire
- motivational story
- Success Stories
- Motivate
- Competitive Exams Success Stories
- telangana man secures three government jobs telugu news
- government employee inspirational success story
- Impact of Success Stories on Government Employees
- Anthony Chakrapani Success Story
- Anthony Chakrapani Real life Story
- TS Gurukulam jobs
- TS Gurukulam Jobs Success Stories
- ts gurukulam jobs success stories telugu
- sakshieducation success stories
- inspirational story