Inspirational Success Story : ఒక ఉద్యోగం వస్తే చాలు అనుకుంటే.. ఏకంగా ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టిందిలా.. కానీ..
ఏళ్ల తరబడి పుస్తకాల పురుగులుగా మారినా కూడా చాలా మందికి ఒక్క జాబ్ వచ్చే సరికే తల ప్రాణం తోకకొస్తుంది. ఎంతో మంది ఏళ్ల తరబడి పోరాడి.. చివరకు నిరాశతో లక్ష్యాన్ని వదిలేస్తుంటారు. అయితే ఓ మహిళ మాత్రం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఈమే హైదరాబాద్ కు చెందిన పద్మ. ఈ నేపథ్యంలో పద్మ సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
పద్మ.. హైదరాబాద్‌లోని వనస్థలిపురం శారద నగర్‌కి చెందిన వారు. ఆమెకు చిన్నతనం నుంచి ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే కోరిక ఉండేది.
ఈమె లైఫ్‌లో ఆశ్చర్యం ఏమిటంటే..?
ఈమె ఉన్నత చదువులు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యారు. అలా చాలా కాలం సర్కార్ కొలువు కోసం పట్టు వదలకుండా శ్రమించారు. ఈ క్రమంలో ఈమె అనేక అవరోధాలను, సమస్యలను ఎదుర్కొన్నారు. చివరకు తన పట్టుదల, కృషి, కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. ఒక ఉద్యోగం వస్తే చాలనుకుంటే.. ఆమెకు ఏకంగా ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి.
ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంపై..
ఒక వైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంపై అందరూ ప్రశంసిస్తున్నారు. మొదట పీజీటీ ఉద్యోగం సాధించిన ఆమె ఇప్పటికే నియామక పత్రాలు పొందారు. తాజాగా జూనియర్ లెక్చరర్ ఫైనల్ లిస్టులోనూ ఎంపికయ్యానని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం పిలిచినట్లు ఆమె పేర్కొన్నారు.
విజేతగా నిలిచిన వారిని మాత్రమే..
విజయం కోసం పోరాడే వారిని సమాజం గుర్తించదు. విజేతగా నిలిచిన వారిని మాత్రమే గుర్తిస్తుంది. చాలా మంది విజయ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో వచ్చే అడ్డంకులకు భయపడి.. లక్ష్యాన్ని వదిలేస్తారు. కొంతమంది మాత్రం ఎన్నో కష్టాలను, సమస్యలను ఎదుర్కొని విజయ శిఖరాలకు అధిరోహించి అందరికీ ఆదర్శంగా కనిపిస్తారు. అలాంటి వారిలో ఇంటిని నడిపించే గృహిణిలు కూడా ఎందరో ఉన్నారు. ఇందుకు సరైన నిదర్శనం పద్మ. పద్మ జీవితం ఎంతో మంది గృహిణిలకు ఆదర్శం.
Tags
- TS Gurukulam Jobs Success Stories
- ts gurukulam jobs success stories telugu
- Success Story
- Competitive Exams Success Stories
- TS Gurukulam jobs
- Failure to Success Stories
- Inspire
- motivational story
- padma success story
- junior lecturer success stories in telugu
- telangana junior lecturer success stories in telugu
- gurukulam jobs successful candidates stories 2024
- Telangana women Secures three Government Jobs
- ts gurukulam tgt success stories in telugu
- ts gurukulam selected candidates success stories
- sakshieducation success stories
- Success Story