Skip to main content

Housewife Inspirational Success Story : గృహిణిగా బాధ్యతలు మోస్తూనే.. ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాల‌ను కొట్టానిలా.. కానీ..

నేటి పోటీ ప్ర‌పంచంలో యువ‌తే కాదు.. గృహిణిలు కూడా ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించి త‌మ స‌త్తాచాటుతున్నారు.
Jyothy     Housewife Achieving Success in Government Employment   Inspiring Success Story

ఇటీవ‌లే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో  కేసముద్రం మండల కేంద్రానికి చెందిన చీకటి జ్యోతి రెండు ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను సాధించి.. అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ నేప‌థ్యంలో చీకటి జ్యోతి స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం : 
కేసముద్రం మండల కేంద్రానికి చెందిన చీకటి జ్యోతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నారు. మండలంలోని కల్వల గ్రామానికి చెందిన నవీన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు మల్టీమీడియాలో శిక్షణ పొందుతుండగా రెండో కుమారుడు ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు.

☛ UPSC Civils Ranker Success Story : వ‌రుస‌గా మూడు సార్లు ఫెయిల్‌.. చివ‌రికి ఈ మాట‌ల వ‌ల్లే సివిల్స్ కొట్టానిలా..

హోటల్‌ నిర్వహిస్తూ.. ఖాళీ సమయంలో..
పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సాధించడమే గొప్ప విషయం.. అలాంటిది ఓ గృహిణి హోటల్‌ నిర్వహిస్తూ.. ఖాళీ సమయంలో తన లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆకాంక్షతో చదువు కొనసాగించారు. పోటీ పరీక్షలకు హాజరై ఒకేసారి రెండు ఉద్యోగాలు సాధించి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు.ఆ దంపతులు జీవనోపాధికోసం మండల కేంద్రంలో 2018 నుంచి హోటల్‌ నిర్వహిస్తున్నారు. హోటల్‌ నిర్వహణలో భర్తకు సహాయంగా నిలుస్తూనే ఆమె ఏంఏ, బీఈడీ పూర్తి చేశారు.

ఒకే సారి రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడంతో..
గత సంవత్సరం ఆగస్టులో నిర్వహించిన గురుకుల పాఠశాలల పీజీటీ, టీజీటీ ఉద్యోగాలతోపాటు జూనియర్‌ లెక్చరర్ల ఉద్యోగ పరీక్ష రాశారు. వారం రోజుల కిందట వెలువడిన పీజీటీ ఫలితాల్లో జ్యోతి ఎంపికయ్యారు. అలాగే ఇటీవ‌లే వెలువరించిన జూనియర్‌ అధ్యాపకుల ఉద్యోగాల ఫలితాల్లోనూ అర్హత సాధించారు. రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడంతో ఆమె తన సంతోషం వ్యక్తం చేశారు.

☛ Telangana Women Secures Four Government Jobs : ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా. కానీ నా చూపు.. ఈ ఉద్యోగం వైపే..

Published date : 04 Mar 2024 10:16AM

Photo Stories