DSC 2008: అభ్యర్థులకు మరో అవకాశం
ఇంతకుముందు ఇచ్చిన గడువులో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాలేకపోయిన, సకాలంలో రిపోర్టు చేయలేకపోయిన అభ్యర్థులు దీన్ని వినియోగించుకోవాలని సూచించింది. డీఎస్సీ–2008 క్వాలిఫైడ్ అభ్యర్థులను మినిమం టైమ్ స్కేల్ వేతనం కింద టీచర్ పోస్టుల్లో నియమించేందుకు గతంలో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అప్పట్లో డీఎస్సీ–2008 క్వాలిఫైడ్ అభ్యర్థులు 2,193 మంది ఉన్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు నివేదికలు సమరి్పంచారు. వీరికి ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశమివ్వగా 1,767 మంది హాజరయ్యారు. వారిని మినిమం టైమ్ స్కేల్‌తో ఎస్‌జీటీ పోస్టుల్లో నియమించారు. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాలేకపోయిన, సకాలంలో రిపోర్టు చేయలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించి నియామకాలు చేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించింది. నియామకాలు పూర్తి చేసి నివేదికలను మార్చి 30లోగా కమిషనరేట్ కార్యాలయానికి పంపాలని సూచించింది. ఎంపికైనవారికి నెలకు రూ.21,230 చొప్పున వేతనం అందించనున్నారు.
చదవండి: