సీఎం కేసీఆర్ ఇచి్చన హామీ మేరకు డీఎస్సీ–2008లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాలని డీఎస్సీ సాధన సమితి కనీ్వనర్ గోవింద్ డిమాండ్ చేశారు.
డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలివ్వండి
ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు రాక అనేక మంది డీఎస్సీ అభ్యర్థులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని ఫిబ్రవరి 5న ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జీవో 39 ద్వారా ఉద్యోగాలిచ్చారని, తెలంగాణలో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఉద్యోగాలివ్వాలని కోరుతూ పలువురు మృతి చెందారని ఆవేదన తెలిపారు. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంలో ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని, మా జీవితాలను కాపాడాలని గోవింద్ కోరారు.