Skip to main content

Sports School: ఆగస్టు 13న క్రీడా పాఠశాలల్లో రాష్ట్రస్థాయి ఎంపికలు

గద్వాల: రాష్ట్రంలోని హాకీంపేట, కరీంనగర్‌, అదిలాబాద్‌ క్రీడా పాఠశాలల్లో 4, 5వ తరగతుల్లో ప్రవేశాలకు రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలను ఈ నెల 13న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు డీవైఎస్‌ఓ బీఎస్‌ ఆనంద్‌ తెలిపారు.
స్టేడియాన్ని పరిశీలిస్తున్న డీవైఎస్‌ఓ ఆనంద్‌
స్టేడియాన్ని పరిశీలిస్తున్న డీవైఎస్‌ఓ ఆనంద్‌

స్థానిక ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లోని హాకీంపేట ప్రాంతీయ క్రీడా పాఠశాలలో ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు విధిగా రాష్ట్రస్థాయి శారీరక, సామర్థ్య ఎంపిక పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. ఒకరోజు ముందే హైదరాబాద్‌కు చేరుకుని స్టేడియంలో రిపోర్టు చేయాలని సూచించారు. ఒరిజినల్‌ విద్యార్హత సర్టిఫికేట్లు, కులం, ఆదాయం పత్రాలు, ఫోటోలతో హాజరు కావాలన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న క్రీడాకారులకు ఆయా పాఠశాలల పీఈటీలు రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలపై అవగాహన కల్పించాలన్నారు.

Also read: Fundamental Literacy Numeracy: విద్యార్థులు కనీస సామర్థ్యాలను సాధించే లక్ష్యంగా "తొలిమెట్టు"

Published date : 09 Aug 2023 03:42PM

Photo Stories