Skip to main content

Awareness of laws: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

నెల్లిమర్ల రూరల్‌: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని విశ్రాంత జిల్లా జడ్జి జి దుర్గయ్య సూచించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని మిమ్స్‌ కళాశాలలో మంగళవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.
వైద్య విద్యార్ధులకు అవగాహన కల్పిస్తున్న విశ్రాంత జడ్జి దుర్గయ్య
వైద్య విద్యార్ధులకు అవగాహన కల్పిస్తున్న విశ్రాంత జడ్జి దుర్గయ్య

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్‌ పేరిట జూనియర్‌ విద్యార్థులను వేధించడం చట్టా రీత్యా నేరమన్నారు. ర్యాగింగ్‌ కారణంగా ఎంతో మంది విద్యార్థులు వారి జీవితాలను అర్ధాంతరంగా ముగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులకు కఠిన శిక్షలు ఉంటాయని, సోదర భావంతో మెలగాలని హితవు పలికారు. సదస్సులో పాల్గొన్న జిల్లా జడ్జి నాగమణి మాట్లాడుతూ విద్యార్ధులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, లక్ష్యం వైపు గురి పెట్టాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో కష్టపడి చదివిస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాలని హితవు పలికారు. మత్తు పదార్థాల వినియోగం, అమ్మకం, కొనుగోలు, రవాణా చేస్తే చట్టపరంగా కఠిన శిక్షలు ఉంటాయని, బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో డీన్‌ డాక్టర్‌ లక్ష్మీకుమార్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రఘురాం, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బెల్లాన రవి, ఎస్సై నారాయణరావు పాల్గొన్నారు.

Also read: Fundamental Literacy Numeracy: విద్యార్థులు కనీస సామర్థ్యాలను సాధించే లక్ష్యంగా "తొలిమెట్టు"

విశ్రాంత జిల్లా జడ్జి దుర్గయ్య

వైద్య విద్యార్ధులకు న్యాయ అవగాహన సదస్సు

Published date : 09 Aug 2023 07:33PM

Photo Stories