Skip to main content

Fundamental Literacy Numeracy: విద్యార్థులు కనీస సామర్థ్యాలను సాధించే లక్ష్యంగా "తొలిమెట్టు"

స్టేషన్‌ఘన్‌పూర్‌: విద్యార్థుల్లో దాగి ఉన్న విద్యా ప్రమాణాల పెంపు, గుణాత్మకమైన మార్పు, విద్యార్థులు కనీస సామర్థ్యాలను సాధించే లక్ష్యంగా తొలిమెట్టు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని డీఈఓ రాము అన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న డీఈఓ రాము
సమావేశంలో మాట్లాడుతున్న డీఈఓ రాము

డివిజన్‌ కేంద్రంలోని మండల విద్యావనరుల కేంద్రంలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఎఫ్‌ఎల్‌ఎన్‌(ఫండమెంటల్‌ లిటరసీ న్యూమరసీ) శిక్షణ శిబిరాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న విద్యాప్రమాణాల పెంపు, గుణాత్మకమైన మార్పు, విద్యార్థుల కనీస సామర్థ్యాలను సాధించేందుకు తొలిమెట్టు ఎంతగానో దోహదపడుతుందన్నారు.  

Also read: Gurukula College: ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం

Published date : 09 Aug 2023 03:15PM

Photo Stories