భద్రాచలంటౌన్: మణుగూరు(మిట్టగూడెం)లోని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో స్పాట్ ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
2022–23లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులు బీఎస్సీ, ఎంపీసీ, ఎంపీసీఎస్, బీకాం(సీఏ), హెచ్‌ఈపీ, ఈఈపీ గ్రూపులలో చేరేందుకు సీట్లు ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 11 నుంచి 20 వరకు గడువు ఉందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.