Skip to main content

State Best School Award: ఉత్తమ విద్యాలయంగా రేగులపాడు KGBV

● స్టేట్‌ బెస్ట్‌ స్కూల్‌ అవార్డుకు ఎంపికపై కేజీబీవీ సిబ్బంది హర్షం ● అభినందించిన జిల్లా అధికారులు ● ఈ నెల 15న ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డు ప్రదానం
State Best School Award: ఉత్తమ విద్యాలయంగా రేగులపాడు KGBV
State Best School Award: ఉత్తమ విద్యాలయంగా రేగులపాడు KGBV

వీరఘట్టం:

విద్యార్థుల హాజరునమోదు.. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన.. విద్యాలక్ష్యాలు చేరుకోవడంతో వీరఘట్టం మండలం రేగులపాడు కస్తూ ర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించింది. ఉత్తమ విద్యాలయంగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారుల నుంచి కేజీబీవీ అధికారులకు గురువారం సమాచారం అందింది.

Also read: AP EAP CET – 2023: ఆగస్టు 14 వరకు ఇంజినీరింగ్‌ ఆప్షన్ల ఎంపికకు గడువు

రాష్ట్రంలో ఉన్న 352 కేజీబీవీలలో రేగులపాడు కేజీబీవీ ఉత్తమమైన దిగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడంపై సిబ్బంది, బాలికలు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది పనితీరును డీఈఓ ఎన్‌.ప్రేమ్‌కుమార్‌, జీసీడీఓ రోజారమణి ప్రశంసించారు. కేజీబీ వీ ఎస్‌ఓ రోహిణికి ఫోన్‌చేసి అభినందనలు తెలిపా రు. ఆగస్టు 15న విజయవాడలో జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేయనున్నారు.

Also read: Diet Cet – 2023: అర్హత సాధించిన విద్యార్థులకు మరో అవకాశం

అంచెలంచెలుగా...

వీరఘట్టం మండల కేంద్రంలో 2011 సెప్టెంబర్‌ 2వ తేదీన కేజీబీవీను ప్రారంభించారు. మొదటి రెండేళ్లు 6, 7, 8 తరగతులను నిర్వహించారు. 2013 నుంచి 6 నుంచి 10వ తరగతి వరకు విద్యాబోధన చేపట్టా రు. నాలుగేళ్ల పాటు వీరఘట్టంలోని ఓ ప్రవేటు భవనంలో కొనసాగిన కేజీబీవీ, తర్వాత రేగులపాడు వద్ద నిర్మించిన భవనంలోకి మార్చారు. 13 మంది బాలికలతో ప్రారంభమైన కేజీబీవీలో నేడు 222 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో 6–10 తరగతి బాలికలు 197 మంది, ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ బాలికలు 18 మంది, సెకెండియర్‌ బాలికలు ఏడుగు రు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం కార్పొరేటు స్థాయిలో సకల సౌకర్యాలు కల్పిస్తుండడంతో రేగులపాడు కేజీబీవీలో సీటుకు తీవ్ర పోటీ నెలకొంది.

Also read: Analog Astronaut Dangeti Jahnavi on CM Jagan's Support: Insights from Palakollu #sakshieducation

పదో తరగతిలో శతశాతం ఫలితాలు

ఏటా పదో తరగతిలో శతశాతం ఫలితాలే నేడు కేజీబీవీని రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా నిలిపాయి. పదో తరగతి ఫలితాల్లో అధికమంది అత్యధిక మార్కులు సాధించడం, ప్రతీ తరగతిలో గరిష్టంగా బాలికలు చేరడంతో పాటు హాజరుశాతం మెరుగ్గా ఉండడంతో ఈ ఏడాది బెస్ట్‌ కేజీబీవీగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఎంపిక చేశారు.

Also read: YSRCP Govt Education System: Impact on Patamata High School Students & Teachers #sakshieducation

ఉత్తీర్ణత శాతం ఇలా...

తొలిసారి 2013లో పదోతరగతి పరీక్షలు రాసిన 13 మంది బాలకలు ఉత్తీర్ణులయ్యారు. 2013 నుంచి 2016 వరకు శతశాతం ఫలితాలు సాధించారు. 2017లో 97 శాతం, 2018లో 93 శాతం, 2019లో 96 శాతం ఫలితాలు నమోదయ్యాయి. 2020 నుంచి 2023 వరకు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. 2023 లో 33 మంది బాలికలు పదోతరగతి పరీక్షలు రాయ గా అందరూ ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యారు. 2022– 23లో ప్రారంభించిన ఇంటర్మీడియట్‌ విద్య మొదటి బ్యాచ్‌లో చేరిన ఏడుగురూ ఉత్తీర్ణులయ్యారు.

Also read: Andhra Pradesh: Parents and Teachers Meeting in AP Govt Schools #sakshieducation

సంతోషంగా ఉంది

రాష్ట్రంలో ఉన్న 352 కేజీబీవీల్లో ఉత్తమ విద్యాలయంగా రేగులపాడు కేజీబీ వీ ఎంపిక కావడం సంతోషంగా ఉంది. టీచర్ల సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు నమోదవుతున్నాయి. ఇక్కడ చేరిన బాలికలు క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తారు. అందుకే శతశాతం ఫలితాలు సాధించగలుగుతున్నాం. ప్రభుత్వం కేజీబీవీకి కావాల్సిన సదుపాయాల న్నీ కల్పించింది. ఆహ్లాదకర వాతావరణంలో విద్యాబోధన సాగుతోంది. ఉన్నత విద్యాశాఖ అధికారులు గుర్తించిన చిన్నచిన్నలోటుపాట్లను సరిచేస్తూ చక్కని విద్యాప్రణాళికను అమలు చేస్తున్నాం. – రోహిణి, కేజీబీవీ ఎస్‌ఓ

Also read: CM Jagan Good News: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధుల విడుదల #sakshieducation

ప్రత్యేక గుర్తింపు

రేగులపాడు కేజీబీవీకి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. చక్కని విద్యాబోధన తో శతశాతం ఫలితాలు నమోదవుతున్నాయి. బాలికల ఉజ్వల భవితకు గట్టి పునాది వేస్తున్నారు. చిన్నచిన్న లోటుపాట్ల తో గతంలో ఉన్నత విద్యాశాఖ అధికారుల ఆగ్రహానికి గురైనా... బోధనలో రాజీపడకుండా ముందుకు సాగుతున్న సిబ్బందికి అభినందనలు. – రోజారమణి, జీసీడీఓ,

పార్వతీపురం మన్యం జిల్లా

Also read: AI in School Education: CM Jagan Reviews Future Technology Skills

Published date : 11 Aug 2023 05:32PM

Photo Stories