Training for HMs: హెచ్‌ఎంలకు ట్రైనింగ్
కర్నూలు కల్చరల్: కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు లీడర్ షిప్ శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. బి.తాండ్రపాడులోని చైతన్య పాఠశాలలో ఆరు రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమాన్ని డీఈఓ వి.రంగారెడ్డి ప్రారంభించి ప్రసంగించారు. రెసిడెన్షియల్ మోడ్‌లో నిర్వహించే నాయకత్వ శిక్షణను ప్రధానోపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏఎంఓ ప్రసాద్, కావల్య ఆర్గనైజేషన్ ప్రతినిధి హిమాన్షి, ఎంఈఓలు పాల్గొన్నారు.
చదవండి: Teacher Jobs: ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నీ భర్తీ చేయాలి
ఆర్‌యూలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్
కర్నూలు (న్యూసిటీ) : రాయలసీమ విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ నెల 31 వర కు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి ఆచార్య ఎ.ఆనందరావు తెలిపారు. ఆయా జిల్లా నుంచి వచ్చిన విద్యార్థులకు సోమవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. సివిల్, మెకానికల్ కోర్సుల్లో 66 చొప్పున సీట్లు ఉండగా ఒక్కొ క్క బ్రాంచ్‌లో ఇద్దరూ చొప్పున నాలుగురు జాయిన్ అయ్యారు. సీఎస్‌సీలో 132 సీట్లకు గాను 131 మంది, ఈసీఈలో 66గాను 66 సీట్లు భర్తీ అవ్వగా, ఆర్టిఫీషి యల్ ఇంటెలిజెన్స్ కోర్సులో 66 సీట్లు ఉండ గా 36 మంది విద్యార్థులు ప్రవేశం పొందారని ప్రిన్సిపాల్ హరిప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. మిలిగిన సీట్లు రెండో విడతలో భర్తీ అయ్యే అవకాశముందని ప్రిన్సిపాల్ తెలిపారు.