Teacher Jobs: ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నీ భర్తీ చేయాలి
ఆగస్టు 27న క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 16,500 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే 5,000 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం జీవో జారీ చేయడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో డీఎస్సీ కోసం నాలుగు లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తుంటే, కొన్ని జిల్లాలకు జీరో పోస్టులు ప్రకటించడం దారుణమన్నారు.
చదవండి: DSC Notification 2023: 5089 పోస్టులకు అనుమతి.. పోస్టులు వివరాలు ఇవే
సంవత్సరాలుగా రూ.లక్షలు వెచ్చించి నిరుద్యుగులు కోచింగ్ తీసుకుంటున్నారని, ఎన్నికలు ఉన్నాయని బీఆర్‌ఎస్ ప్రభుత్వం నామమాత్రంగా పోస్టులు భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవడం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో వర్సిటీ పీడీఎస్‌యూ నాయకులు శివసాయి, రవీందర్, అక్షయ్, ఆకాశ్, రామకృష్ణ, రాకేశ్, హన్మాండ్లు, రాము తదితరులు పాల్గొన్నారు.
చదవండి: TS DSC Notification 2023: జిల్లాల వారీగా టీచర్ పోస్టులు ఇవీ.. అత్యధిక ఖాళీలు ఈ జిల్లాలోనే