Science Congress Competitions: విద్యార్థులకు సైన్స్ కాంగ్రెస్ పోటీలు..
సాక్షి ఎడ్యుకేషన్: బాల శాస్త్రవేత్తలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూని కేషన్ ఆధ్వర్యంలో బాలలసైన్స్ కాంగ్రెస్‌ను ఏటా నిర్వహిస్తున్నారు. నిర్దిష్ట సమస్యలపై శాస్త్రీయ పరిశోధనలు చేపట్టేందుకు పిల్లలను ప్రోత్సహించే ప్రత్యేకమైన కార్యక్రమం ఇది. బాలల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడమే బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం. బాలలు నిత్య జీవితంలోని పరిస్థితులతో విజ్ఞానశాస్త్రాన్ని పరస్పరం అనుసంధానం చేయడం ద్వారా క్లిష్టమైన స్థానిక సమస్యలకు పరిష్కారం కనుక్కోవాల్సి ఉంటుంది.
➤ JNTU: జేఎన్‌టీయూ జీవీ క్లాస్–2 ఈసీ కమిటీ ఏర్పాటు
సామాజిక సమస్యలపై శాస్త్రీయంగా ఆలోచించడం, కారణాలను అన్వేషించడం, శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించడానికి బాలలు ప్రయత్నించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన పరిశోధనల ద్వారా గ్రహించిన ఆంశాలను నివేదికలుగా తయారు చేసి ప్రాజెక్ట్ రిపోర్టును జిల్లా స్థాయి పోటీల్లో ప్రదర్శించాలి. బాల సైంటిస్టులు చేసే అత్యుత్తమ ప్రాజెక్టుల ప్రదర్శనకు జాతీయ సైన్స్ కాంగ్రెస్ వేదిక అవుతుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 8న ఆప్‌కాస్ట్ నేతృత్వంలో జిల్లా స్థాయిలో ఈ ప్రదర్శనలు నిర్వహించేలా అధికార యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తోంది.
➤ Mega Job Mela: జెడ్పీ పాఠశాలలో మెగా జాబ్ మేళా
వీరు అర్హులు..
10–17 సంవత్సరాల బాలలకు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలు నిర్వహించి వారిలో ప్రతిభను వెలికితీస్తుంది. జాతీయ స్థాయిలో ఉత్తమమైన ప్రాజెక్ట్‌గా నిలిస్తే దానికి పేటెంట్ హక్కు లభిస్తుంది. ప్రాజెక్టు తయారు చేసిన విద్యార్థులకు జాతీయస్థాయిలో రిజర్వేషన్, నగదు బహుమతి అందజేస్తారు.
ప్రాజెక్టులు చేయాల్సిన అంశం ఇదే..
జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2023–24 జిల్లా స్థాయి పోటీలు నంబర్ 8వ తేదీన నిర్వహించనున్నారు.‘ఆరోగ్యం, శ్రేయస్సు కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం’ ఈ ఏడాది బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రధాన అంశం. దీనికి తోడు మీ పర్యావరణ వ్యవస్థను తెలుసుకోవాలి. ఆరోగ్యం పోషణ, శ్రేయస్సును పెంపొందించడం, పర్యావరణ వ్యవస్థ, ఆరోగ్యం కోసం సామాజిక, సాంస్కృతిక పద్ధతులు, పర్యావరణ వ్యవస్థ ఆధారిత జీవన విధానం, ఆరోగ్య కోసం సాంకేతిక ఆవిష్కరణ వంటి ఐదు ఉప అంశాల్లో మాత్రమే బాలల ప్రాజెక్టులు రూపొందించాల్సి ఉంటుంది. ఈ విధంగా విద్యార్ధులు సిద్ధం చేసిన ప్రాజెక్టు నివేదికను సదరు పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు జిల్లా స్థాయి పోటీలకు ప్రభుత్వం నిర్ధేశించిన ఆన్‌లైన్ లింక్‌లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది.
➤ New Green Card: గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డు
ప్రాజెక్టు రూపకల్పన ఇలా...
బాలలు ఎంచుకున్న ఉప అంశానికి సంబంధించి గైడ్ టీచర్ సహాయంతో సర్వే, పరిశీలన, ప్రశ్నావళి, కేస్ స్టడీస్ ఆధారంగా ప్రాజెక్టులు చేపట్టి, రిపోర్టు తయారు చేయాల్సి ఉంటుంది.
➤ School Students: విద్యార్థుల కోసమే ఓపెన్‌హౌస్
ప్రెజెంటేషన్ సమయంలో ప్రాజెక్ట్ రిపోర్ట్, లాగ్ బుక్, నాలుగు చాప్టర్లు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ 6 నిమిషాలు, వైవా 2 నిమిషాలు ఉంటుంది.
ప్రతి పాఠశాల నుంచి కనీసం ఒక ప్రాజెక్ట్ తప్పనిసరిగా ఉండాలి.
ఒక పాఠశాల నుంచి ఎన్ని ప్రాజెక్టులు అయినా సమర్పించవచ్చు.
6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు పాల్గొనవచ్చు.
➤ ISO certification: ఎస్వీయూకి ఐఎస్‌ఓ గుర్తింపు
ఉత్తమమైనవిగా ఉండాలి
పరిశోధన చేసే దిశగా బాలలను సమాయత్తం చేయడమే సైన్స్ కాంగ్రెస్ లక్ష్యం. స్థానిక సమస్యలకు పరిష్కారం చూపేవిధంగా ఈ పరిశోధనలు ఉండాలి. శాస్త్రీయంగా పరిశోధనలు చేసి ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. జిల్లా స్థాయికి విద్యార్థులంతా సమాయత్తం కావాలి. ఈనెల 31 లోగా రిజిస్ట్రేషన్లు పూర్తిచేయాలి.
గిరడ లక్ష్మణరావు,
జిల్లా సైన్స్ అధికారి, పార్వతీపురం మన్యం.
మార్గదర్శకులుగా ఉపాధ్యాయులుండాలి
విద్యార్థులు ప్రాజెక్టులు సిద్ధం చేయడంలో ప్రతి సైన్స్ ఉపాధ్యాయుడు మార్గదర్శకుడిగా ఉండాలి. ఆరోగ్యం సుస్థిరత కోసం పర్యవరణాన్ని అర్థం చేసుకోవడం అనే అంశంపై ఇచ్చిన ఐదు ఉప అంశాలపై విద్యార్థులతో పరిశోధనలు చేయించాలి.
పి.రామకృష్ణ, ఆప్కాస్ట్,
జిల్లా కోఆర్డినేటర్, పార్వతీపురం మన్యం.
➤ Jagananna Civil Services Scheme: సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక దరఖాస్తులు
బాలలను సన్నద్ధం చేయాలి
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాలల సైనన్స్ కాంగ్రెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రతి పాఠశాల నుంచి విద్యార్ధులు సిద్ధం చేసిన ప్రాజెక్టులు సైన్స్ కాంగ్రెస్‌లో ప్రదర్శించేలా చూడాలి. ఔత్సాహిక విద్యార్థులను జిల్లా స్థాయి ప్రదర్శనలకు సంసిద్ధం చేయాలి.
కె.ప్రేమ్‌కుమార్, డీఈఓ, పార్వతీపురం మన్యం.