School Students: విద్యార్థుల కోసమే ఓపెన్‌హౌస్
ఎర్రవల్లిచౌరస్తా: ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి పదో బెటాలియన్‌లో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాలలో భాగంగా గురువారం ఓపెన్‌హౌన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెటాలియన్‌లో సిబ్బంది ఆయా పాఠశాలల విద్యార్థులకు ఆయుధాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమాండెంట్ సాంబయ్య హాజరై మాట్లాడారు. ఓపెన్‌హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల విద్యార్థులకు పోలీసులు అంటే భయం పోతుందన్నారు. అలాగే సమాజంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా బలపడుతుందన్నారు. విద్యార్థులకు ఆయుధాలపై అవగాహణ కల్పించి, పోలీస్ వ్యవస్థ యొక్క పనితీరును గురించి ఆయన వివరించారు కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నాగభూషనం, ఆర్‌ఐలు రాజారావు, రాజు, వెంకటేశ్వర్లు, సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.
చదవండి: QS World University Rankings 2024: హైదరాబాద్ ఐఎస్‌బీకి 78వ ర్యాంకు